ఎన్నికల కోడ్ ఉల్ల‍ంఘించినందుకు కేంద్రమంత్రిపై ‘ఎఫ్‍ఐఆర్’

| Edited By:

Mar 19, 2019 | 3:51 PM

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ కేంద్రమంత్రి జయంత్ సిన్హాపై రాంచీలో కేసు నమోదైంది. పౌర విమానయాన సహాయమంత్రిగా పనిచేస్తున్న సిన్హా… ప్రస్తుతం జార్ఖండ్‌లోని హజారీబాగ్ నుంచి ఎంపీగా ఉన్నారు. శనివారం ఐఐఎం రాంచీలో విద్యార్ధులతో మాట్లాడిన సిన్హా “వచ్చే ఐదేళ్లకు కూడా తమను ఆశీర్వదించాలని” కోరారని పోలీసులు వెల్లడించారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై ఓ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జిల్లా అధికారుల ఆదేశాలతో జయంత్ సిన్హాపై కేసు నమోదు చేశాం. ఐపీసీ సెక్షన్ 188, […]

ఎన్నికల కోడ్ ఉల్ల‍ంఘించినందుకు కేంద్రమంత్రిపై ఎఫ్‍ఐఆర్
Follow us on

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ కేంద్రమంత్రి జయంత్ సిన్హాపై రాంచీలో కేసు నమోదైంది. పౌర విమానయాన సహాయమంత్రిగా పనిచేస్తున్న సిన్హా… ప్రస్తుతం జార్ఖండ్‌లోని హజారీబాగ్ నుంచి ఎంపీగా ఉన్నారు.

శనివారం ఐఐఎం రాంచీలో విద్యార్ధులతో మాట్లాడిన సిన్హా “వచ్చే ఐదేళ్లకు కూడా తమను ఆశీర్వదించాలని” కోరారని పోలీసులు వెల్లడించారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై ఓ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జిల్లా అధికారుల ఆదేశాలతో జయంత్ సిన్హాపై కేసు నమోదు చేశాం. ఐపీసీ సెక్షన్ 188, ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద‌ ఆయనపై కేసు నమోదైంది…’’ అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేవారిపై నిఘా వేయాలని దేశంలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు ఎన్నికల సంఘం ముందుగానే ఆదేశాలు జారీచేసింది.