ఆషాఢం తర్వాతే అత్తారింటికి..

|

Jul 25, 2019 | 8:46 PM

ఆషాడంలో సొంతిల్లు కాదని అత్తారింటికి వెళ్లకపోవమే కాదు…సొంత పార్టీని వదలి అత్తారిల్లులాంటి మరో పార్టీలోకి వెళ్లాలంటే కూడా ముహూర్తం చూసుకుంటున్నారు లీడర్లు. ఈ మధ్య ఇళ్లలో శుభకార్యాలకంటే రాజకీయ పార్టీలు, నేతల్లోనే ముహూర్తాల ట్రెండ్ మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. ఇక కమలం నేతలు ఈ విషయంలో కాస్త గట్టి నమ్మకమే పెట్టుకున్నారట. తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ లోటస్ తో షేక్ చేస్తామంటున్న కాషాయ నేతలు…అసలు కథ ఆషాడం తర్వాత అంటూ.. అటు ఏపీలో ఇటు తెలంగాణలో నేతలకు […]

ఆషాఢం తర్వాతే అత్తారింటికి..
Follow us on

ఆషాడంలో సొంతిల్లు కాదని అత్తారింటికి వెళ్లకపోవమే కాదు…సొంత పార్టీని వదలి అత్తారిల్లులాంటి మరో పార్టీలోకి వెళ్లాలంటే కూడా ముహూర్తం చూసుకుంటున్నారు లీడర్లు. ఈ మధ్య ఇళ్లలో శుభకార్యాలకంటే రాజకీయ పార్టీలు, నేతల్లోనే ముహూర్తాల ట్రెండ్ మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. ఇక కమలం నేతలు ఈ విషయంలో కాస్త గట్టి నమ్మకమే పెట్టుకున్నారట. తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ లోటస్ తో షేక్ చేస్తామంటున్న కాషాయ నేతలు…అసలు కథ ఆషాడం తర్వాత అంటూ.. అటు ఏపీలో ఇటు తెలంగాణలో నేతలకు గుబులురేపుతున్నారు.

మాజీ ఎంపీ వివేక్ చేరిక కూడా ఆషాఢంతోనే ముడిపడి ఉందట. ఎన్నికలకు ముందే గులాబీవనం నుంచి బయటకొచ్చిన వివేక్..ఇన్నాళ్లు సొంత పొలిటికల్ ప్లాట్ ఫాం కోసం ప్లాన్ చేసినట్లు కనిపించింది. అయితే అదంత ఈజీ కాదునుకున్నారో ఏమో చివరకు బీజేపీ వైపు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇదే సమయంలో సర్కార్ పై కాస్త స్వరం కూడా పెంచారు వివేక్. ఎక్కవగా ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి చూపించే వివేక్ అందుకే బీజేపీ లోచేరేందుకు మొగ్గు చూపారాని పొలిటికల్ టాక్.

అయితే ఇప్పటికే పార్టీల చేరికల విషయంలో వివేక్ చాలా ఇబ్బందుల్లో పడ్డారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరడం ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోకి రావడం ఎన్నికల తర్వాత మళ్లీ గులాబీ గూటికి ఇలా అటు ఇటు చేరికతో పొలిటికల్ గా చాలా లాస్ అయ్యారు వివేక్. దీంతో ఇప్పుడు కమలంలో చేరికకు తొందరపడకుండా ముహూర్తం చూసుకుని వెళ్తున్నారట వివేక్. బీజేపీ కూడా ఆషాడం ఆఫర్ లేదు శ్రావణమే ముద్దనడంతో వివేక్ చేరిక ఆషాఢం నుంచి శ్రావణానికి పోస్ట్ ఫోన్ అయిందనే టాక్ వినిపిస్తోంది.

<