మోడీకి పోటీగా మాజీ జవాన్..!

వారణాసి: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఎన్నికల్లో బడా నేతలపై పోటీ చేయడానికి కొంతమంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధానికి పోటీగా బరిలోకి దిగుతానని ప్రకటించారు బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాన్  తేజ్‌ బహదూర్‌ యాదవ్‌. కాగా రెండేళ్ల క్రితం జవాన్లకు సరైన […]

మోడీకి పోటీగా మాజీ జవాన్..!
Follow us

|

Updated on: Mar 30, 2019 | 11:33 AM

వారణాసి: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఎన్నికల్లో బడా నేతలపై పోటీ చేయడానికి కొంతమంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధానికి పోటీగా బరిలోకి దిగుతానని ప్రకటించారు బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాన్  తేజ్‌ బహదూర్‌ యాదవ్‌.

కాగా రెండేళ్ల క్రితం జవాన్లకు సరైన ఫుడ్ లేదంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి పాపులర్ అయ్యారు తేజ్ బహదూర్.. హర్యానాలోని రేవారి ప్రాంతానికి చెందిన బహదూర్‌ లోక్‌సభ ఎన్నికల్లో మోడీతో పోటీ పడడానికి సిద్ధమైయ్యాడు. ఇకపోతే తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలుసుకుని చాలా పార్టీలు తనను సంప్రదించాయని.. కానీ నేను మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని వెల్లడించారు మాజీ జవాన్. భద్రతాబలగాల్లో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. గెలుపు, ఓటమి అనేది తనకు ముఖ్యం కాదని తెలిపారు. ముఖ్యంగా పారామిలిటరీ దళాల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ఈ పోటీకి దిగుతున్నట్టు ప్రకటించారు.