AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముందు రాష్ట్రంలో గెలిచి చూపించు: చంద్రబాబుకు రాంమాధవ్ సవాల్

ముందు రాష్ట్రంలో గెలిచి చూపించు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సవాల్ విసిరారు. నెల్లూరులో శుక్రవారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో రాంమాధవ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఏపీలో అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని రాంమాధవ్ అన్నారు. దేశాన్ని రక్షిస్తానంటూ తిరుగుతున్న చంద్రబాబు ముందు ఈ ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మోదీయేనని, దేశ ప్రజలంతా […]

ముందు రాష్ట్రంలో గెలిచి చూపించు: చంద్రబాబుకు రాంమాధవ్ సవాల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 5:02 PM

Share

ముందు రాష్ట్రంలో గెలిచి చూపించు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సవాల్ విసిరారు. నెల్లూరులో శుక్రవారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో రాంమాధవ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఏపీలో అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని రాంమాధవ్ అన్నారు. దేశాన్ని రక్షిస్తానంటూ తిరుగుతున్న చంద్రబాబు ముందు ఈ ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.

మళ్లీ అధికారంలోకి వచ్చేది మోదీయేనని, దేశ ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారని రాంమాధవ్ పేర్కొన్నారు. మోదీని తమ ప్రాంతం నుంచి పోటీ చేయాల్సిందిగా అన్ని ప్రాంతాల ప్రజలు కోరుతున్నారని ఆయన అన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైనా రాంమాధవ్ విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పట్టుమని పది సీట్లు కూడా దక్కించుకోలేని కేసీఆర్ ప్రధానిని అవుతానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.

Follow Us