Etela Meets DS : భవిష్యత్‌ రాజకీయం వైపు వడివడిగా ఈటల అడుగులు.. టీఆర్‌ఎస్‌ ఎంపీ డీఎస్ తో రెండు గంటలపాటు భేటీ

|

May 12, 2021 | 5:30 PM

Etela Rajender Meets TRS MP : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు.

Etela Meets DS : భవిష్యత్‌ రాజకీయం వైపు వడివడిగా ఈటల అడుగులు..  టీఆర్‌ఎస్‌ ఎంపీ డీఎస్ తో రెండు గంటలపాటు భేటీ
Etela Meets Ds
Follow us on

Etela Rajender Meets TRS MP : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. భూకబ్జా ఆరోపణలతో ముఖ్యమంత్రి కేసీఆర్..ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన నేపథ్యంలో ఈటల తన భవిష్యత్ రాజకీయ వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలతో ఈటల భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈటల రాజేందర్‌.. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడైన డీఎస్‌తో భేటీ కావటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయ అంశమైంది. ఇవాళ నిజామాబాద్ లో ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ డీఎస్ తో భేటీ అయ్యారు. డీఎస్ నివాసంలో ఈ భేటీ సుమారు రెండు గంటలపాటు జరిగింది. కాగా, ఈ భేటీలో తండ్రి డీఎస్‌తో పాటు బీజేపీ ఎంపీ అరవింద్‌ కూడా పాల్గొనటం విశేషం. కాగా, గత కొన్ని రోజులుగా డీఎస్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ పరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌ ఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఈటల.. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌తో కూడా చర్చలు జరపనున్నట్లు సమాచారం. అంతేకాదు, ఈటల త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డితో కూడా భేటీ కావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఇక.. తన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో చర్చించి.. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయటంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఈటల చెప్పుకొస్తున్నారు.

Read also : Black fungus : బ్లాక్ ఫంగస్ ముప్పుపై ముందే మేల్కొన్న భారత్.. మార్కెట్లో డ్రగ్ కొరత ఏర్పడకుండా ముమ్మర చర్యలు