ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది

|

Mar 18, 2019 | 11:04 AM

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఆయన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 27 నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనుంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ […]

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది
Follow us on

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఆయన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది.

26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 27 నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనుంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ నిర్వహించి, మే 23న ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగియనుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కలెక్టర్లుకు ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ అందరి అభ్యర్ధుల పేర్లను ప్రకటించగా.. టీడీపీ, బీజేపీ మరికొందరి పేర్లను ప్రకటించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం అభ్యర్ధులెవరినీ ఇంకా ప్రకటించలేదు.