“నమో టీవీ”పై వివరణ కోరిన ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ : ఇటీవలే ప్రారంభమైన “నమో టీవీ” పై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 24 గంటలు ప్రసారమయ్యే ఈ ఛానెల్ లోగోలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఉండటం.. ఆయన ప్రసంగాలనే ప్రసారం చేస్తుండటంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు నమో ఛానెల్ ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియజెప్పాలని ఎన్నికల సంఘంకు చేసిన ఫిర్యాదులో కోరారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:09 pm, Wed, 3 April 19
"నమో టీవీ"పై వివరణ కోరిన ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ : ఇటీవలే ప్రారంభమైన “నమో టీవీ” పై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 24 గంటలు ప్రసారమయ్యే ఈ ఛానెల్ లోగోలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఉండటం.. ఆయన ప్రసంగాలనే ప్రసారం చేస్తుండటంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు నమో ఛానెల్ ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియజెప్పాలని ఎన్నికల సంఘంకు చేసిన ఫిర్యాదులో కోరారు. అయితే మార్చి 31న ఈ నమో టీవీ ప్రారంభమైంది. ఇందులో ప్రధాని మోదీ ప్రసంగాలు, ర్యాలీలను కవరేజ్ చేస్తున్నారు. ఈ ఛానెల్ కార్యక్రమాల్ని బీజేపీ నేతలు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ ఛానెల్ నిర్వాహకులు ఎవరన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. మొత్తానికి కాంగ్రెస్, ఆప్ నేతల ఫిర్యాదుతో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిని వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశించింది.