టికెట్ ఇవ్వలేదు. అందుకే బీజేపీలో చేరుతున్నా, తృణమూల్ కాంగ్రెస్ నేత సోనాలి గుహ
తృణమూల్ కాంగ్రెస్ నేత, ఒకప్పుడు సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలైన సోనాలి గుహకు పార్టీ టికెట్ లభించలేదు. టీఎంసీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె ఇక బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత, ఒకప్పుడు సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలైన సోనాలి గుహకు పార్టీ టికెట్ లభించలేదు. టీఎంసీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె ఇక బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ ఇటీవల విడుదల చేసింది. కానీ ఆ జాబితాలో ఈమె పేరు లేదు. తన మనస్తాపాన్ని గుర్తించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ తనను పార్టీలోకి ఆహ్వానించారని, ఆయన సూచన మేరకు కమలం పార్టీలో చేరుతున్నానని ఆమె వెల్లడించారు. బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కూడా అయిన సోనాలి… ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదన్నారు. అందువల్లే తప్పనిసరిగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ లో తనకు గౌరవం లేదని. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఆమె అన్నారు. పార్టీకోసం ఎంతో సేవ చేశా.. ఈ విషయం మమతా బెనర్జీకి, ఇతరులకు కూడా తెలుసు అని సోనాలి గుహ చెప్పారు. కొత్త పార్టీకి కూడా ఇలాగే సేవలందిస్తానని సోనాలి గుహ పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని తెలియగానే ఈమె కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ఈ విషయాన్ని కనీసం తెలియజేయనైనా తెలియజేయలేదని,తనను విశ్వాసం లోకి తీసుకోలేదని ఆమె అన్నారు. ఇటీవల అనేకమంది తృణమూల్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిపోయారు. పార్టీలో తమకు తగిన స్థానం లభించలేదని కొందరు, ఈ ఎన్నికల్లో టికెట్ లభించక కొందరు ఇలా పలువురు పార్టీని వీడారు. అయితే ఈ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఎవరు వెళ్లినా తమకు నష్టం లేదంటున్నారు. ఇది వారి వారి సొంత నిర్ణయమని, పార్టీలోనే కొనసాగవలసిందిగా తాము ఎవరినీ బలవంత పెట్టె ప్రసక్తి లేదని ఆమె అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్ కతా లో దీదీ భారీ రోడ్ షో