AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉమెన్స్ డే స్పెషల్ : బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన పి.వి. సింధు.. నేటి యువతకు ఆదర్శంగా తెలుగు తేజం..

Women's Day : పి.వి సింధు .. ఈ పేరు తెలుగు ప్రజలతో పాటు యావత్ భారతదేశానికి సుపరిచరితం. రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన తొలి మహిళగా తెలుగుతేజం సింధు రికార్డు సృష్టించిన విషయం

ఉమెన్స్ డే స్పెషల్ :  బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన పి.వి. సింధు.. నేటి యువతకు ఆదర్శంగా తెలుగు తేజం..
uppula Raju
| Edited By: |

Updated on: Mar 08, 2021 | 11:30 AM

Share

Women’s Day : పి.వి సింధు .. ఈ పేరు తెలుగు ప్రజలతో పాటు యావత్ భారతదేశానికి సుపరిచరితం. రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన తొలి మహిళగా తెలుగుతేజం సింధు రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈమె పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. ఈమె జూలై 5, 1995 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. పివి రమణ దంపుతుల పూర్వీకులు ఆంధ్రప్రాంత వాసులు. సింధు ఎనిమిదేళ్ళ వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన ఆమె.. అంచెలంచెలుగా ఎదుగుతూ 2012, సెప్టెంబరు 21న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకొని మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది.

ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించిన సింధు… ఆ టోర్నీలో పథకం సాధించిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. మార్చి 30, 2015న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది. ఆగస్టు 18, 2016 న రియో ఒలంపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించడం ద్వారా ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి… ఒలంపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది. సైనా నెహ్వాల్ 2012 ఒలంపిక్స్ లో కాంస్యపతకం సాధించిన తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణి సింధు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సింధు 12–21,5–21తో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయింది. కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో మారిన్‌కు కాస్త పోటీనిచ్చిన సింధు రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. రన్నరప్‌గా నిలిచిన సింధుకు 5,320 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.

International womens day 2021 : మహిళలు ఈ పుడ్స్‌ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.. లేదంటే ఎన్ని అనర్థాలో తెలుసా..?

భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

 కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!