AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England: రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఎఫెక్ట్.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది నిజంగా అవమానమే..

India vs England: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ బ్యాట్స్‌మెన్‌లలో అత్యుత్తమ ఆటగాడు అని ప్రత్యేకంగా...

India vs England: రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఎఫెక్ట్.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది నిజంగా అవమానమే..
Shiva Prajapati
| Edited By: Team Veegam|

Updated on: Mar 08, 2021 | 3:24 PM

Share

India vs England: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ బ్యాట్స్‌మెన్‌లలో అత్యుత్తమ ఆటగాడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని కెప్టెన్సీలో టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో విజయాలను కైవసం చేసుకుంది. తన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాలు చేకూర్చిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇటీవలి కాలంలో కొహ్లీపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా విజయం సాధిస్తున్నప్పటికీ.. కోహ్లీపై మాత్రం నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆసిస్ టూర్‌లో వైఫల్యం తరువాత నుంచి కోహ్లీపై విమర్శలు మరింత పెరిగాయి. అయితే, ఆసిస్‌తో సిరీస్ అనంతరం టీమిండియాలో యువ ప్లేయర్లు సంచలనం సృష్టిస్తున్నారు. తమ బ్యాటింగ్, బౌలింగ్‌తో అదరగొడుతున్నారు. జట్టు విజయాన్ని అందించడంతో విశేషంగా కృషి చేస్తున్నారు. అయితే, ఇప్పుడిదే విరాట్ కోహ్లీకి మరింత ఇబ్బందికరంగా మారిందని క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో తాజాగా జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లో చేసిన స్కోర్, పడగొట్టిన వికెట్ల సంఖ్య.. కోహ్లీని కాస్త ఇరకాటంలో పెట్టిందని అంటున్నారు. ఈ సిరీస్ మొత్తంలో కెప్టెన్ కోహ్లీ కంటే కూడా బౌలర్లు ఎక్కువ స్కోర్ చేయడం ఈ చర్చకు దారి తీసింది.

వాస్తవానికి, భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసింది ఇంగ్లండ్ కెప్టెన్ రూట్. మొత్తం సిరీస్‌లో డబుల్ సెంచరీతో సహా 368 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండవ స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీతో కలుపుకుని మొత్తం 345 పరుగులు చేశాడు. అదే సమయంలో 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు చేసిన రిషబ్ పంత్ 270 పరుగులు చేశాడు. బెన్ స్టాక్స్ 203 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు.

అశ్విన్, సుందర్ తర్వాత విరాట్ కోహ్లీ.. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఐదవ, ఆరవ స్థానంలో భారత బౌలర్లు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ 189 పరుగులు చేసి ఐదవ స్థానంలో ఉంటే.. వాషింగ్టన్ సుందర్ 181 పరుగులతో ఆరో స్థానంలో నిలిచాడు. వీరిద్దరి తరువాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడవ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 4 మ్యాచ్‌ల్లో 172 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక అశ్విన్, సుందర్‌లు కోహ్లీని మాత్రమే వెనక్కి నెట్టలేదు. ఏకంగా జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఓపెనర్ బ్యాట్స్‌మెన్ పుజారాను కూడా వెనక్కి నెట్టేసి స్కోర్ బోర్డులో ముందు నిలిచారు. ఇప్పుడిదే విరాట్‌కు అవమానకరంగా పరిణమించింది. కెప్టెన్ విరాట్ ఏడో స్థానంలో ఉండటంపై అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ 2019 సంవత్సరం నుండి ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేదు.

Also read: Acharya Movie Shooting : అదిరిపోయే డ్రెస్స్‌లో ఆచార్య.. బొగ్గు గనుల మధ్య పోరాడుతున్న చిరు, రామ్‌చరణ్.. వైరల్ అవుతున్న ఫొటోలు..

రంగారెడ్డి జిల్లాలో భయానక ఘటన.. మిట్ట మధ్యాహ్నం రోడ్డు పక్కన వేపచెట్టుకు వేలాడుతూ మనిషి.. తీరా చూస్తే..

తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు