AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుమ్మురేపిన ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్.. వన్డేల్లో అరుదైన ఘనత.. ఖుషీ చేసుకుంటున్న కోహ్లీ టీమ్.!

Devdutt Paddikkal Record: విజయ్ హజారే ట్రోఫీలో యువ ఆటగాళ్ల ప్రతిభ బయటపడుతోంది. ముఖ్యంగా ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్, కర్ణాటక ఓపెనర్ దేవదూట్ పడిక్కల్ అయితే ..

దుమ్మురేపిన ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్.. వన్డేల్లో అరుదైన ఘనత.. ఖుషీ చేసుకుంటున్న కోహ్లీ టీమ్.!
Ravi Kiran
|

Updated on: Mar 08, 2021 | 2:51 PM

Share

Devdutt Paddikkal Record: విజయ్ హజారే ట్రోఫీలో యువ ఆటగాళ్ల ప్రతిభ బయటపడుతోంది. ముఖ్యంగా ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్, కర్ణాటక ఓపెనర్ దేవదూట్ పడిక్కల్ అయితే సెంచరీల మోత మోగిస్తున్నాడు. అతడు ఆడిన చివరి ఆరు మ్యాచ్‌లలో నాలుగు భారీ శతకాలు ఉన్నాయి. 52,97,152,126*,145*,101… ఇవి పడిక్కల్ గత మ్యాచ్‌ల స్కోర్లు. ఐపీఎల్‌కి ముందు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ.. పడిక్కల్ విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ క్రమంలోనే శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార్ సంగక్కర ప్రపంచ రికార్డును సైతం బద్దలు కొట్టాడు.

కేరళతో జరిగిన మ్యాచ్‌తో తన విధ్వంసాన్ని మొదలుపెట్టిన దేవదూట్ పడిక్కల్.. వరుస సెంచరీలతో దుమ్మురేపాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక రన్ గెట్టర్‌గా నిలిచాడు. టోర్నీ క్లైమాక్స్‌కు చేరుకోగా.. పడిక్కల్ ఇప్పటికే 250 సగటుతో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో 700 పరుగులు సాధించాడు.

కుమార సంగక్కర ప్రపంచ రికార్డుతో సమానం…

శ్రీలంక ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, ఓపెనర్ కుమార్ సంగక్కర 2015 వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 4 సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును పడిక్కల్ చెరిపేశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. సంగక్కర ప్రపంచ రికార్డును సమం చేశాడు. కాగా, పడిక్కల్ అద్భుత ఫామ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ముఖ్యంగా ఆ టీం కెప్టెన్ కోహ్లీ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. ఏది ఏమైనా ఐపీఎల్ 2021లో ట్రోఫీని సాధించాలని పట్టుదలతో ఉంది ఆర్సీబీ టీం.

Also Read:

Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!

ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఈ ఐదుగురికి ప్లేస్ పక్కా.. వారెవరంటే.!

అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క దెబ్బతో కోట్లు గెలుచుకుంది.. అసలు మ్యాటర్ ఇదే.!