ఎన్నికల కోడ్‍తో బీసీ రాయితీ చెక్కుల పంపిణీకి చెక్

| Edited By:

Mar 23, 2019 | 6:34 PM

వరుస ఎన్నికల నేపథ్యంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా పంపిణీ చేయాల్సిన సబ్సిడీ రుణాల చెక్కులు నిలిచిపోయాయి. గత ఆగస్టు15 సందర్భంగా కేటగిరి ఒకటి కింద ఎంపికైన 50వేల మందికి రూ.50 వేల చొప్పున గ్రాంటును మంజూరు చేశారు. లబ్ధిదారుడు మళ్లీ రుణం చెల్లించాల్సిన అవసరం లేకుండా 100% సబ్సిడీతో గ్రాంటును మంజూరు చేశా రు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మందికి పంపిణీ చేయాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ వచ్చింది. దాంతో చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. అసెంబ్లీ […]

ఎన్నికల కోడ్‍తో బీసీ రాయితీ చెక్కుల పంపిణీకి చెక్
Follow us on

వరుస ఎన్నికల నేపథ్యంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా పంపిణీ చేయాల్సిన సబ్సిడీ రుణాల చెక్కులు నిలిచిపోయాయి. గత ఆగస్టు15 సందర్భంగా కేటగిరి ఒకటి కింద ఎంపికైన 50వేల మందికి రూ.50 వేల చొప్పున గ్రాంటును మంజూరు చేశారు. లబ్ధిదారుడు మళ్లీ రుణం చెల్లించాల్సిన అవసరం లేకుండా 100% సబ్సిడీతో గ్రాంటును మంజూరు చేశా రు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మందికి పంపిణీ చేయాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ వచ్చింది. దాంతో చెక్కుల పంపిణీ నిలిచిపోయింది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీసీ కార్పొరేషన్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు కొన్ని మండలాల్లో చెక్కులను పంపిణీ చేశారు. అంతలోనే సర్పంచ్‌ ఎన్నికల కోడ్‌ రావడంతో చెక్కుల పంపి ణీ మరోసారి నిలిచి పోయింది. తాజాగా లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో చెక్కుల గడువు తీరిపోయింది. దాంతో మళ్లీ కొత్త చెక్కులను సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్‌ 11న తొలి విడత పోలింగ్‌ పూర్తవగానే ఎన్నికల కమిషన్‌ అనుమతితో 20 వేల మందికి చెక్కుల పంపిణీకి బీసీ సంక్షేమశాఖ కసరత్తు చేస్తోంది.