పంచాయతీ ఎన్నికలను స్వాగతించిన సీపీఐ.. ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ సహకరించాలన్న రామకృష్ణ
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను తొలి నుంచి వామపక్షాలు స్వాగతిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా..
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను తొలి నుంచి వామపక్షాలు స్వాగతిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఎర్రపార్టీ నేతలు. గతంలో నిర్వహించిన ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపిస్తున్నారు.
అయితే కరోనా కారణంగా గతంలో ఎన్నికల ప్రక్రియ నిలింపోవడం .. అనంతరం ఎస్‌ఈసీ వర్సెస్ ప్రభుత్వంగా మారిన ఎన్నికల ప్రక్రియలో చివరికి ఎస్‌ఎసీకి అనుకూలంగా హైకోర్టు తీర్పును వెల్లడించడం తెలిసిందే. ఇక ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రభుత్వం చివరి ప్రయత్నంగా సుప్రీకోర్టు మెట్లెక్కింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు.
ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును పాటించకుండా ఉద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. ప్రజలకు సేవకులుగా ఉద్యోగులు వ్యవహరించాలని సూచించారు. ఎవరైనా రాజ్యాంగ విలువలకు కట్టుబడి పని చేయాల్సిందేనని చెప్పారు.