పవన్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో పవన్‌తో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని

పవన్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

Edited By:

Updated on: Sep 30, 2020 | 2:29 PM

Narayana slams Pawan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో పవన్‌తో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని, అందుకు ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం రైతులకు వ్యతిరేకంగా చట్టం చేసిందని విశాఖపట్టణంలో మంగళవారం వామపక్షాలు ఆందోళన చేశాయి. ఈ  సందర్భంగా నారాయణ మాట్టాడుతూ.. ఆనాడు తమతో పొత్తు పెట్టుకున్న పవన్‌, ఇప్పుడు ప్రధాని మోదీ కాళ్లు మొక్కుతున్నాడని విమర్శలు చేశారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్‌కి వ్యక్తిత్వమే లేదంటూ మండిపడ్డారు. ఇక మోదీ నిర్ణయాలను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించడం లేదో చెప్పాలని నారాయణ ప్రశ్నించారు.

Read More:

వివాదంలో ముమైత్‌ఖాన్‌.. క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు

ఆర్కే నాయుడుతో దిల్‌రాజు ‘షాదీ ముబారక్’‌