
హస్తం గుర్తుపై గెలిచిన అతి తక్కువ మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి మైకు పట్టుకొని సర్కారు అది చేయలేదు. ఇది చేయలేదంటూ ఏకిపారేసేవారు. కాని వన్ మన్త్ నుంచి ఏమైందో కాని ఆయన జాడ లేరు. కనీసం చుట్టం చూపుగా కూడా జనం మధ్యలోకి కాని…పార్టీ వ్యవహారాల్లో కాని కనిపించిన పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను అర్హుడినే అంటూ చెప్పుకున్న ఆ ప్రజాప్రతినిధి..ఇప్పుడు ఎక్కడున్నారని రాజకీయ పార్టీల్లో ఓ అనుమానం కలుగుతోంది. ఇంతకీ ఆయన ఎవరో కాదు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై , సీఎం కేసీఆర్‌పై తరచూ విమర్శలు, ప్రశ్నలు సంధించే జగ్గారెడ్డి…..కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సాగర్ ఉపఎన్నికల సమయంలో కూడా అందుబాటులో లేకపోవడం కొంత అనుమానించాల్సిన పరిస్థితి నెలకొంది. మెడికల్ కాలేజీ కోసం పాదయాత్ర చేస్తా …సింగూర్ జలాల కోసం దీక్ష చేస్తానంటూ ప్రకటనలకే పరిమితమైన జగ్గారెడ్డి.. అవసరమైన సమయంలో ఎక్కడున్నారనే ప్రశ్నలు సొంత గూటి నుంచే వినిపిస్తున్నాయి. ఇక్కడే కాదు…పొరుగు రాష్ట్రమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తన మద్దతిస్తానంటూ ప్రగల్భాలు పలికారు జగ్గన్న.
పొరుగు రాష్ట్రం సంగతి పక్కన పెడితే …నెల రోజులుగా కామ్ అయిపోయారు జగ్గారెడ్డి. సాగర్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది. ప్రచారంలో పార్టీలోని ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. కాని జగ్గారెడ్డి మాత్రం ఇదేం తనకు పట్టదు అన్నట్లుగా అజ్ఞాతంలో గడపటం వెనుక ఏమై ఉంటుందన్న సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. ఒకటి, రెండ్రోజుల్లో ఆయన సాగర్ ఎన్నికల ప్రచారంలో కనిపించకపోతే …అందరి అనుమానాలు నిజమేనని భావించక తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎక్కడున్న సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉనికిని కాపాడుకుంటారో ? లేక ఊహగానాలనే నిజం చేస్తారో చూడాలి.
భార్య ప్రేమతో లంచ్ చేస్తుంటే.. ఆఫీసులో అమ్ముకుంటున్న భర్త.. రీజన్ చాలా సిల్లీ..!