CM KCR: నేడు వాసాలమర్రి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గ్రామంలో సందడి వాతావరణం

| Edited By: Ravi Kiran

Aug 04, 2021 | 11:12 AM

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం

CM KCR: నేడు వాసాలమర్రి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గ్రామంలో సందడి వాతావరణం
CM KCR
Follow us on

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR.. మరోసారి వాసాలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు. ఈ గ్రామాన్ని CM KCR దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పర్యటించిన ఈయన.. బుధవారం ఈ గ్రామంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మరో 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం గ్రామాన్ని సందర్శించనున్నారు. ఇంతకు ముందు జూలై 9న గ్రామ పర్యటనకు సిద్ధమైనా.. వాయిదా పడింది. సీఎం గ్రామంలోని దళితవాడలో పర్యటించడంతోపాటు రైతువేదికలో 130 మందితో సమావేశం కానున్నారు. గ్రామానికి సీఎం కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమవగా.. గ్రామంలో సందడి వాతావరణం నెలకొన్నది.

అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు వాసాలమర్రిలో ఏర్పాట్లపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నాక గత నెలలో ఆ ఊరికి వెళ్లిన సీఎం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

అనంతరం, గ్రామ సభ నిర్వహించి గ్రామాభివృద్ధికి పలు సూచనలు చేశారు. అందరూ కష్టపడి పనిచేస్తే వాసాలమర్రి ఆరు నెలలు తిరిగే సరికి బంగారు వాసాలమర్రి అవుతుందంటూ హితబోధ చేశారు. వాసాలమర్రి గ్రామాభివృద్ధికి రూట్ మ్యాప్‌ ప్రకటించడమే కాకుండా ఒకే ఒక్క ఏడాదిలో రూపురేఖలు మార్చేస్తానని ప్రకటించారు. ఇంకా 20 సార్లయినా వాసాలమర్రికి వస్తానంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే 20రోజులు కూడా తిరక్కముందే రెండోసారి బుధవారం గ్రామానికి వెళ్తున్నారు.

వాసాలమర్రి అభివృద్ధి చెందాలంటే గ్రామస్తుల్లో ఐక్యమత్యంతోపాటు పైకి రావాలనే పట్టుదల ఉండాలంటూ తన మొదటి పర్యటనలో దిశానిర్దేశం చేశారు కేసీఆర్‌. వారానికి కనీసం రెండు గంటలైనా గ్రామస్తులంతా పనిచేయాలన్నారు. మరి, రేపటి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాసాలమర్రి అభివృద్ధికి ఎలాంటి వరాలు ప్రకటిస్తారో గ్రామస్తులకు ఏం దిశానిర్దేశం చేస్తారోనని ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి: SI Suspended: మరిపెడ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై అధికారుల సీరియస్..

Price is more Than Gold: మీకు ఈ సంగతి తెలుసా.. ఈ పక్షి ఈకలు బంగారం ధర కంటే ఎక్కువ..

PayDay Loan: మీకు శాలరీ రావడం ఆలస్యమవుతోందా.. రూ.లక్ష కావాలా.. కేవలం నెల రోజుల కోసం ఈ బ్యాంక్‌లో పే డే లోన్