ఇవాళ ఆరు సభల్లో పాల్గొననున్న చంద్రబాబు

ఎన్నికల తేదీ దగ్గరపడుతుండగా.. ప్రచారాన్ని ముమ్మరం చేశారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆరు సభల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఉదయం 11గంటలకు నెల్లూరు సభలో పాల్గొననున్న చంద్రబాబు, మధ్యాహ్నం 12 గంటలకు సత్యవేడులోని బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అలాగే మధ్యాహ్నం 2.30గంటలకు నెల్లూరు జిల్లాల సూళ్లురుపేటలోని సభలో, 3.30గంటలకు నెల్లూరు జిల్లా గూడూరులోని సభలో, సాయంత్రం 5.30గంటలకు ప్రకాశం జిల్లా కొండెపి సభలో, రాత్రి 7గంటలకు ఒంగోలు సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. సమావేశాల్లో […]

ఇవాళ ఆరు సభల్లో పాల్గొననున్న చంద్రబాబు

Edited By:

Updated on: Mar 25, 2019 | 8:43 AM

ఎన్నికల తేదీ దగ్గరపడుతుండగా.. ప్రచారాన్ని ముమ్మరం చేశారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆరు సభల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఉదయం 11గంటలకు నెల్లూరు సభలో పాల్గొననున్న చంద్రబాబు, మధ్యాహ్నం 12 గంటలకు సత్యవేడులోని బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అలాగే మధ్యాహ్నం 2.30గంటలకు నెల్లూరు జిల్లాల సూళ్లురుపేటలోని సభలో, 3.30గంటలకు నెల్లూరు జిల్లా గూడూరులోని సభలో, సాయంత్రం 5.30గంటలకు ప్రకాశం జిల్లా కొండెపి సభలో, రాత్రి 7గంటలకు ఒంగోలు సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. సమావేశాల్లో కార్యకర్తలు, నేతలను ఆయన తన ప్రసంగంతో ఉత్సాహపరచనున్నారు.