AP Politics: శ్రీకాకుళం జిల్లాలో క్యాంప్‌ రాజకీయాల కాక.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు

|

Sep 24, 2021 | 11:48 AM

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో క్యాంప్‌ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ మధ్య

AP Politics: శ్రీకాకుళం జిల్లాలో క్యాంప్‌ రాజకీయాల కాక..  పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు
111
Follow us on

Srikakulam District Politics: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో క్యాంప్‌ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు భగ్గుమన్నాయి. నందిగామ మండలంలో 16 ఎంపీటీసీలను తిలక్ గెలిపించుకున్నారు. టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఆయనే ఉండడంతో.. ఎవరికి ఎంపీపీ పదవి ఇవ్వాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఇదే దువ్వాడ శ్రీనివాస్‌కు నచ్చలేదు. తాను సూచించిన క్యాండెట్‌కే పదవి ఇవ్వాలని హుకుం జారీచేశారు. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది.

దువ్వాడ అల్టిమేటమ్‌తో అలర్టయిన తిలక్‌.. గెలిచిన ఎంపీటీసీలందర్నీ క్యాంప్‌కి తరలించారు. ఈ పరిణామం దువ్వాడకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. పార్టీ విప్ ధిక్కరిస్తే తిలక్‌తో పాటు ఎంపీటీసీలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని రిలీజ్‌ చేసిన వీడియోలో హెచ్చరించారు.

దువ్వాడ వార్నింగ్‌లకు తిలక్‌ దిగొస్తారా? ఎంపీటీసీలందర్నీ వెంటబెట్టుకుని తీసుకొస్తారా? లేదంటే తన పంతమే తిలక్‌ నెగ్గించుకుంటారా? ఎంపీపీ ఎన్నిక ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు గుంటూరుజిల్లా పెదకూరుపాడు ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీపీ పదవికి ఆశావహుల మధ్య పోటాపోటీ నెలకొంది. పెదకూరపాడు మండలంలో మొత్తానికి మొత్తంగా 14ఎంపీటీసీలను వైసీపీ గెల్చుకుంది. దీంతో ఎవరికి వారే మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. అయితే నేతల మధ్య రాజీ కుదరలేదు. దీంతో సమావేశానికి ఎంపీటీసీలంతా డుమ్మా కొట్టారు. దీంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు అధికారులు.

Read also: Maharashtra: 29 కాదు.. మృగాళ్ళా తెగబడింది 33 మంది.. మహారాష్ట్ర ఘటనలో షాకింగ్ ఫ్యాక్ట్స్.!