గొడవలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి.. పాలన గాడి తప్పితే రాష్ట్రపతి పాలన విధించాలన్న బుద్దా వెంకన్న

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరపాలన్న అత్యున్నత ధర్మాసనం తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని టీడీపీ ఎమ్మెల్సీ..

  • K Sammaiah
  • Publish Date - 5:09 pm, Mon, 25 January 21
గొడవలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి.. పాలన గాడి తప్పితే రాష్ట్రపతి పాలన విధించాలన్న బుద్దా వెంకన్న

ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును అధికార పార్టీ మినహా అన్ని ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరపాలన్న అత్యున్నత ధర్మాసనం తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

అయితే ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ మొండి వైఖరి బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్‌.. కేంద్రం దృష్టికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సజావుగా సాగకుండా కుట్రలు పన్నే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

ఎలాంటి గొడవలకు తావులేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బుద్దా వెంకన్న కోరారు. ఒకవేళ పాలన గాడి తప్పితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఈసీ సర్వాధికారాలు ఉపయోగించైనా ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికీ ఒకే ప్రభుత్వం ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.