ఏపీలో ‘జగన్’ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో జరిగిన పార్టీ బహిరంగ సభలో రాంమాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ అంటేనే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడిపోతున్నారని.. ఆయన పాలన అలా ఉందని విమర్శించారు. కేంద్రం.. ప్రత్యేక హోదా ఇవ్వదని తెలిసీ.. జగన్ ప్రజలను మోసం చేశారని అన్నారు. జగన్.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వేరని.. ఇప్పుడు చెబుతున్న హామీలు వేరని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీకి మేలు కంటే.. కీడే జరుగుతుందేమోనన్న భయం కలుగుతుందని వ్యాఖ్యానించారు. కాగా.. 2024లో ఖచ్చితంగా ఏపీలో బీజేపీ వస్తుందని జ్యోతిష్యం చెప్పారు. గత్యతరం లేని స్థితిలో.. ఏపీ ప్రజలు వైసీపీకి ఓటేశారని పేర్కొన్నారు.