ప్రత్యేక హోదా తప్ప.. జగన్ ఇంకేమడిగినా మోదీ చేస్తారు : కన్నా
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి మోదీని కలిసినా ఎలాంటి లాభం ఉండదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తిరుపతిలోని మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకి వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా’ అంశం ముగిసిన అధ్యాయమని.. అయినా.. సీఎం జగన్ మోదీని అడిగితే అభ్యంతరం లేదని పేర్కొన్నారు. హోదా విషయం తప్ప.. జగన్ ఇంకేమడిగినా మోదీ చేస్తారని తేల్చిచెప్పారు. చంద్రబాబైనా, […]
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి మోదీని కలిసినా ఎలాంటి లాభం ఉండదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తిరుపతిలోని మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకి వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా’ అంశం ముగిసిన అధ్యాయమని.. అయినా.. సీఎం జగన్ మోదీని అడిగితే అభ్యంతరం లేదని పేర్కొన్నారు. హోదా విషయం తప్ప.. జగన్ ఇంకేమడిగినా మోదీ చేస్తారని తేల్చిచెప్పారు. చంద్రబాబైనా, జగనైనా ప్రజలను మోసం చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్రానికి నిధుల విషయంలోనైనా, అభివృద్ధి విషయంలోనైనా సహాయమందించడానికి మోదీ ముందుంటారని స్పష్టం చేశారు కన్నా లక్ష్మీనారాయణ.