బీజేపీ, జనసేన కీలక భేటీ.. తిరుపతి ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై ఉమ్మడి అవగాహన

|

Jan 27, 2021 | 1:27 PM

అటు తిరుపతి ఉప ఎన్నికలు, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు.. ఈ నేపథ్యంలో కమలనాథులు కమలనాథులు, జనసైనికులు.. కీలక..

బీజేపీ, జనసేన కీలక భేటీ.. తిరుపతి ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై ఉమ్మడి అవగాహన
Follow us on

అటు తిరుపతి ఉప ఎన్నికలు, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు.. ఈ నేపథ్యంలో కమలనాథులు కమలనాథులు, జనసైనికులు.. కీలక భేటీ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను లైట్‌గానే తీసుకుంటున్నా.. తిరుపతి లోక్‌సభపై ఉమ్మడి జెండాను ఎగిరేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిందనే ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

బీజేపీ, జనసేన కూటమి మధ్య తిరుపతి ఉపఎన్నికపై చిన్నపాటి కోల్డ్ వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకుండానే అభ్యర్థులపై రెండు పార్టీలు కామెంట్స్ చేశాయి. దీనిపై పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌ కావడంతో బీజేపీ లీడర్లు షాక్‌ తిన్నారు. దీంతో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజే రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మొన్నటికి మొన్న నేరుగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపారు.

తిరుపతి ఉప ఎన్నికలో అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు. గెలుపే లక్ష్యం అంటూ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో వరుస భేటీలు నిర్వహిస్తున్న ఇరు పార్టీల నేతలు.. తాజాగా మరో మారు గుంటూరులో సమావేశం అయ్యారు. త్వరలో తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల్ రాబోతుంది. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో రెండు పార్టీలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది.