బీజేపీపై పోలీసులకు ఒడిశా సీఎం ఫిర్యాదు

|

Apr 08, 2019 | 8:50 PM

భువనేశ్వర్‌: బీజేపీపై ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్‌ పార్టీ అధినేత నవీన్‌ పట్నాయక్‌  పోలీసు స్టేషనులో ఫిర్యాదు దాఖలు చేశారు. ప్రత్యేకహోదా పేరుతో నాలుగున్నర కోట్ల మంది ఒడిశా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని కర్వేలా నగర్‌ పోలీసు స్టేషనులో ఆయన ఫిర్యాదు చేశారు. ఆదివారం ఒడిశా రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి బీజేపీ  విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా అంశం లేదు. దీనిపై బీజేడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2014 మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేక […]

బీజేపీపై పోలీసులకు ఒడిశా సీఎం  ఫిర్యాదు
Follow us on

భువనేశ్వర్‌: బీజేపీపై ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్‌ పార్టీ అధినేత నవీన్‌ పట్నాయక్‌  పోలీసు స్టేషనులో ఫిర్యాదు దాఖలు చేశారు. ప్రత్యేకహోదా పేరుతో నాలుగున్నర కోట్ల మంది ఒడిశా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని కర్వేలా నగర్‌ పోలీసు స్టేషనులో ఆయన ఫిర్యాదు చేశారు. ఆదివారం ఒడిశా రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి బీజేపీ  విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా అంశం లేదు. దీనిపై బీజేడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2014 మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేక హోదా అంశాన్ని ఈ ఎన్నికల్లో ఎందుకు తొలగించారు? అని భారతీయ జనతా పార్టీని బీజేడీ నాయకులు ప్రశ్నించారు. మొత్తం 15 ప్రశ్నలను  బీజేడీ నాయకులు సంధించారు. తమ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని ఈ జనవరిలో ప్రధాని నరేంద్రమోదీకి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే.