కేసీఆర్, జగన్ భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..?

| Edited By:

Sep 24, 2019 | 10:27 AM

ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేయూత ఇవ్వడం లేదని ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు రాష్ట్రాల బాగు కోసం తాము తీసుకునే నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్రమోదీని కలిసి ఈ అంశాలపై చర్చించాలని ఇరువురు […]

కేసీఆర్, జగన్ భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..?
Follow us on

ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేయూత ఇవ్వడం లేదని ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు రాష్ట్రాల బాగు కోసం తాము తీసుకునే నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్రమోదీని కలిసి ఈ అంశాలపై చర్చించాలని ఇరువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక మాంద్యం ప్రమాదకరంగా మారిందని, ఇప్పటికే పలు రంగాలపై ప్రభావం చూపుతోందని తెలంగాణ సీఎం తెలిపారు. ఇక జగన్ కూడా ఏపీలోని పరిస్థితులను వివరించారు.

ఇక తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు బాగుపడేలా గోదావరి-కృష్ణా నదులను లింక్ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అంతేకాదు గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుంచి, ఎలా తరలించాలి, అలైన్ మెంట్ ఎలా ఉండాలి అనే దానిపై కొంత స్పష్టత వచ్చింది. దీంతోపాటు వివిధ అంశాలపై ఇద్దరు సీఎంలు 4 గంటల పాటు చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విద్యుత్, పోలీస్ ఉద్యోగులకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ఇరువురు అంగీకరించారు. ఇక వచ్చే నెలలో మరోసారి ఇద్దరూ భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం.