Free food grains : కరోనా నేపథ్యంలో దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయబోతోన్న మోదీ సర్కారు

| Edited By: Phani CH

Apr 23, 2021 | 5:52 PM

Free food grains: దేశంలో కరోనా మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పరిస్థితులు తలెత్తుతోన్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Free food grains : కరోనా నేపథ్యంలో దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయబోతోన్న మోదీ సర్కారు
Big Decision By Pm
Follow us on

Modi Government : దేశంలో కరోనా మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పరిస్థితులు తలెత్తుతోన్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తోన్న పేదలుకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద మే, జూన్ మాసాల్లో దేశ వ్యాప్తంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయనున్నారు. 80 కోట్ల మంది పేదలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు సరఫరా చేయనున్నారు. ఆహార ధాన్యాల కోసం కేంద్రం రూ.26 వేల కోట్లు ఖర్చు చేయనుంది. గతంలో లాక్ డౌన్ విధించిన సమయంలోనూ కేంద్రం ఇదే విధంగా రేషన్ దుకాణాల ద్వారా ఆహార ధాన్యాలు పంపిణీ చేసింది. కాగా, కోవిడ్ -19 సంక్రమణ తీవ్రంగా ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వర్చువల్ సమావేశం నిర్వహించిన సందర్భంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్ , గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కాగా, భారత్ లో ఫస్ట్ వేవ్ కంటే ఈసారి కరోనా వ్యాప్తి అత్యంత అధికంగా ఉంది. రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలకు పైన నమోదు కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Terrific: అమ్మో..అమ్మనే చంపుకు తినేశాడు..కుక్కతోనూ తినిపించాడు..దారుణాతి దారుణం!

Telangana Corona: నైట్‌ కర్ఫ్యూ విధించడం కాదు.. ప్రజలను బయట తిరగనీయకూడదు: తెలంగాణ హైకోర్టు