AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఎంపీ ఎన్నోసార్లు తనకు రక్షణ కల్పించాలని ప్రధానిని, హోం మంత్రిని కోరారు, కాంగ్రెస్ నేతల వెల్లడి

దాద్రా అండ్ నాగర్ హవేలీ నుంచి ఏడు సార్లు ఎంపీగా గెలిచిన  మోహన్ దెల్కర్..తనకు రక్షణ కల్పించాలని, సాయం చేయాలనీ కోరుతూ ఎన్నోసార్లు ప్రధాని మోదీకి, హోమ్ మంత్రి అమిత్ షాకు,లోక్ సభ స్పీకర్  ఓం బిర్లాకు  లేఖలు రాశారని.....

ఆ ఎంపీ  ఎన్నోసార్లు తనకు రక్షణ కల్పించాలని ప్రధానిని, హోం మంత్రిని  కోరారు, కాంగ్రెస్ నేతల వెల్లడి
Mohan Delkar
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 14, 2021 | 12:56 PM

Share

దాద్రా అండ్ నాగర్ హవేలీ నుంచి ఏడు సార్లు ఎంపీగా గెలిచిన  మోహన్ దెల్కర్..తనకు రక్షణ కల్పించాలని, సాయం చేయాలనీ కోరుతూ ఎన్నోసార్లు ప్రధాని మోదీకి, హోమ్ మంత్రి అమిత్ షాకు,లోక్ సభ స్పీకర్  ఓం బిర్లాకు  లేఖలు రాశారనికాంగ్రెస్ నేత సచిన్ సావంత్ తెలిపారు ఈ  ఎంపీ గత నెల 22 న ముంబైలోని ఓ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నారు. తనను బీజేపీ నేతలు కొందరు, కేంద్ర ప్రభుత్వం లోని అధికారులు కొంతమంది వేధిస్తున్నారని మోహన్ దెల్కర్ తన సూసైడ్ నోట్ లో ఆరోపించారు. అయితే ప్రధానికి, హోమ్ మంత్రికి ఎన్నిసార్లు లేఖలు రాసినా వారి నుంచి స్పందన లేకపోవడంతో దెల్కర్ సూసైడ్ చేసుకున్నారని సచిన్ సావంత్ చెప్పారు.  ఇది ప్రజాస్వామ్యానికే ట్రాజెడీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎంపీకి ప్రధాని గానీ, హోమ్ మంత్రి గానీ తక్షణమే సాయం చేసి ఉంటే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండేవారు కారని సావంత్ అన్నారు.   ముఖ్యంగా దాద్రా అండ్ నాగర్ హవేలీ పాలనాధికారి  ప్రఫుల్ ఖేదా పటేల్ ఆయనను ఎన్నోసార్లు అవమానించారని, నీ కుటుంబాన్ని జైల్లో పెడతానని బెదిరించారని సావంత్ పేర్కొన్నారు. తనకు ఏ సంబంధం లేని నేరాల్లో ఈ అధికారి తో  బాటు మరికొందరు ఇరికించాలని ప్రయత్నించారని, అనేకమార్లు  వేధించినట్టు దెల్కర్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారన్నారు.

ఎంపీ పదవికి రాజీనామా చేయడమో లేదా ఆత్మహత్య చేసుకోవడమో తప్ప తనకు మరో మార్గం లేదని దెల్కర్ భావించారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని ఆయన ఆశించారన్నారు. అయితే ఇతర పార్టీ నేతలను ఈ ప్రభుత్వం ఎంత నిర్దయగా చూస్తుందో తెలుస్తోందని సావంత్ పేర్కొన్నారు . కాగా దెల్కర్ ను సూసైడ్ కి ప్రేరేపించారన్న ఆరోపణపై ప్రఫుల్ ఖేదా పటేల్ పై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి: ఎగురుతూ వచ్చి బొక్కబోర్ల పడ్డ పక్షి.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న వీడియో.. ఎలాగో మీరు చూడండి..

అనంతపురం జిల్లాలో యువకుడి దారుణ హత్య.. నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తులతో దాడి.. కారణాలు ఇలా ఉన్నాయి..