అనంతపురం జిల్లాలో యువకుడి దారుణ హత్య.. నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తులతో దాడి.. కారణాలు ఇలా ఉన్నాయి..
Young Man Brutal Murder : అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై కొంతమంది కత్తులతో దాడి చేసి చంపేశారు. ఫ్యాక్షన్ గొడవలో.. లేదా పర్సనల్ గొడవలో
Young Man Brutal Murder : అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై కొంతమంది కత్తులతో దాడి చేసి చంపేశారు. ఫ్యాక్షన్ గొడవలో.. లేదా పర్సనల్ గొడవలో తెలియదు కానీ.. ఇలాంటి సంఘటనలు జిల్లాలో నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. మరికొన్ని కేసులు మిస్టరీగా నే మిగిలిపోతున్నాయి. నేటి యువత చిన్న చిన్న గొడవలకే కక్ష కట్టి మరీ ఒకరికొకరు చంపేసుకుంటున్నారు. కుటుంబాలను ఆగం చేస్తున్నారు. తాజా హత్య గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కూడేరు మండలం శివరాంపేటకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి గ్రామంలో వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. ఎవరితో గొడవలు ఉన్నాయో తెలియదు కానీ రాత్రిపూట పొలం దగ్గర నిద్రిస్తున్నప్పుడు కొంతమంది దుండగులు దాడి చేశారు. కత్తులతో విచక్షణ రహితంగా కడుపులో పొడిచి హత్య చేశారు. ఉదయం కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు.