TS BJP: మిషన్‌-19..! తెలంగాణ బీజేపీ కొత్త టార్గెట్.. విజయమే లక్ష్యంగా బండి సంజయ్ ప్లానింగ్

|

Dec 28, 2021 | 9:24 PM

మిషన్‌-19.. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా వినిపిస్తున్న పదం. అది కూడా అధికారం కోసం ప్రయత్నాల్లో ఉన్న పార్టీలు వాడుతున్న పదం. అందులోనూ తెలంగాణ బీజేపీ కొత్త టార్గెట్ ఇది.

TS BJP: మిషన్‌-19..! తెలంగాణ బీజేపీ కొత్త టార్గెట్.. విజయమే లక్ష్యంగా బండి సంజయ్ ప్లానింగ్
Ts Bjp
Follow us on

మిషన్‌-19.. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా వినిపిస్తున్న పదం. అది కూడా అధికారం కోసం ప్రయత్నాల్లో ఉన్న పార్టీలు వాడుతున్న పదం. అందులోనూ తెలంగాణ బీజేపీ కొత్త టార్గెట్ ఇది. ఇప్పటికే సర్వే కూడా నిర్వహించింది. ఇంతకీ కమలనాథుల ప్లానింగ్ ఏంటి? సర్వేలో ఏం తేలింది? తెలంగాణ బీజేపీ జోష్‌లో ఉంది. అధికారంలోకి రావడమే టార్గెట్‌గా దూసుకెళ్లాలని హైకమాండ్‌ దిశానిర్దేశం చేయడంతో నేతలు దూకుడు పెంచారు. ఇప్పటికే వరి యుద్ధం పీక్‌ స్టేజ్‌లో నడుస్తోంది. నిరుద్యోగ దీక్ష కూడా చేపట్టారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రపైనా యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇక ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై ఫోకస్ చేస్తున్నారు. SC నియోజకవర్గాలపై వర్క్‌షాప్‌ నిర్వహించింది.

రాష్ట్రంలో 19 SC నియోజక వర్గాలు ఉన్నాయి. ఇక్కడ TRS పరిస్థితి ఏంటి? బీజేపీ బలం ఎంత? ఎన్నికల నాటికి ఏం చేయాలి? ఇలాంటి అంశాలపై ఇప్పటికే ఓ సర్వే నిర్వహించింది కమలదళం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించిన 19 సీట్లలో 7 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందట. మరో మూడు చోట్ల TRSతో గట్టి పోటీ ఉందట. మిగితా స్థానాల్లోనూ ఎన్నికల సమయంలోపు బలోపేతం అవ్వాలని SC నాయకులకు దిశానిర్దేశం చేశారు బండి సంజయ్.

TRS, కాంగ్రెస్‌ దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయన్నది బీజేపీ వర్షన్. అందుకే ఆ వర్గం ఓట్లపై ఫోకస్ చేస్తోంది. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్న నినాదంతో దగ్గరవ్వాలని చూస్తోంది. సర్వేల్లోనూ కాస్త పాజిటివ్‌ రిజల్ట్స్‌ రావడంతో SC నాయకులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది హైకమాండ్.

ఇవి కూడా చదవండి: Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..

Hyderabad: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. ట్రాఫిక్‌ ఇక్కట్లకు చెక్.. జనవరి 1న షేక్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం