ఏపీలో తెలంగాణ సీన్ రిపీట్ అయింది. పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్‌రావు, గట్టు నాగమణిలను నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన మరువక ముందే నెల్లూరులో సేమ్ సీన్ రిపీట్ అయింది. కాకపోతే ఇక్కడ దుండగుల నుంచి తప్పించుకుని తీవ్ర గాయాలతో బయటపడ్డాడీ లాయర్. వివరాల్లోకి వెళితే నెల్లూరులో ప్రముఖ న్యాయవాది కొండ రమేష్ పూ రౌడీ మూకలు దాడికి దిగారు. ఇంటిలోకి వెళ్లి మరీ దాడి చేశారు.
ఈ దాడిలో న్యాయవాది రమేష్ తలకు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాధితుడు రమేష్ ను స్థానికులు నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కోలుకుంటున్నారు. సకాలంలో సమీప నివాసాల ప్రజలు రాకుండా ఉంటే ఊహించని ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యుడైన న్యాయవాది కొండా రమేష్ కు అతని అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు జరుగుతున్నాయి. దాడి ఘటన నుంచి అదృష్టవ శాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డ కొండ రమేష్ బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పట్టపగలు రౌడీ మూకలు, దుండగులు దాడులు చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. స్థానికులు తీవ్రంగా కలవరపడుతున్నారు.
Read more:
గృహనిర్మాణ పథకంపై సీఎం జగన్ సమీక్ష.. పేదల ఇళ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి ఏమన్నారంటే..