పంచాయతీల్లో మీకెందుకు ఓటెయ్యాలి.. ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం.. టీడీపీ మేనిఫెస్టో విడుదల

|

Jan 28, 2021 | 1:23 PM

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ పోరు రసవత్తవరంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి ఎందుకు ఓటెయ్యాలి అంటూ ...

పంచాయతీల్లో మీకెందుకు ఓటెయ్యాలి.. ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం.. టీడీపీ మేనిఫెస్టో విడుదల
Follow us on

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ పోరు రసవత్తవరంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి ఎందుకు ఓటెయ్యాలి అంటూ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన గురువారం పంచసూత్రాల పేరుతో పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

బలవంతపు ఏకగ్రీవాలను ఒప్పుకునేది లేదని చంద్రబాబు స్పష్టంచేశారు. రౌడీయిజంతో చేసే ఎన్నికలను ఆమోదించమని ఆయన పేర్కొన్నారు. 20నెలలుగా ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 125 దాడులు జరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదంతా ప్రభుత్వం అసమర్థతని విమర్శించారు. పంచాయతీల పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు వెల్లడించారు. గ్రామాల్లో ప్రార్థనాలయాలన్నింటినీ కాపాడే బాధ్యతను తమ సర్పంచ్‌లు తీసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారన్నారు.

భూ కబ్జాలను, రౌడీలను నియంత్రిస్తామని, పారిశుధ్యాన్ని మెరుగు పరుస్తామని పేర్కొన్నారు. తమ సర్పంచ్‌లను గెలిపిస్తే స్వయం సమ్రుద్ధిని సాధించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. అవినీతి జరగకుండా.. వనరులను ఉపయోగించుకుంటూ అందరినీ సమన్యాయం చేయడమే తమే ధ్యేయమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Also Read: 

AP Local Body Elections Live : ఏపీ పంచాయతీ సమరం రోజుకో మలుపు.. కాకరేపుతున్న ఆన్‌లైన్‌ నామినేషన్లు.. 

రాజ్‌భవన్‌కు చేరుకున్న బీజేపీ నేతలు.. కాసేపట్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఇరు పార్టీల భేటీ