మీ ఓటు ఎవరికి పడిందో చూసుకోండి: చంద్రబాబు

ఓటు వేసినప్పుడు వీవీప్యాట్‌లో మీ ఓటు ఎవరికి పడిందో ప్రతి ఒక్కరూ చూసుకోవాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏదైనా తేడా ఉంటే వెంటనే అక్కడున్న ఎన్నికల సిబ్బందికి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సెగ్మెంట్‌లో జరిగిన రోడ్‌షోలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించమంటే.. ఎన్నికల సంఘం ఒప్పుకోలేదన్నారు. అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లామని, ఈ నెల 9న కోర్టులో కేసు విచారణకు వస్తుందని చెప్పారు చంద్రబాబు.

Edited By:

Updated on: Apr 05, 2019 | 11:31 AM