Badvel Politics: CM జగన్ బద్వేల్ పర్యటనతో మొదలైన పొలిటిక్ హీట్.. ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్

| Edited By: Sanjay Kasula

Jul 09, 2021 | 9:33 PM

ముఖ్యమంత్రి జగన్ బద్వేల్ పర్యటన ఉప ఎన్నిక ప్రచారాన్ని తలపించింది. బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో ఖాళీ అయిన స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికకు ముందస్తు ప్రచార సభగా మారింది.

Badvel Politics: CM జగన్ బద్వేల్ పర్యటనతో మొదలైన పొలిటిక్ హీట్.. ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్
Badvel Politics
Follow us on

ముఖ్యమంత్రి జగన్ బద్వేల్ పర్యటన ఉప ఎన్నిక ప్రచారాన్ని తలపించింది. బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో ఖాళీ అయిన స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికకు ముందస్తు ప్రచార సభగా మారింది. బద్వేల్ పర్యటనలో ప్రత్యేకంగా కనిపించిన వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధను YCP అభ్యర్థిగా ప్రకటిస్తారన్న CM జగన్ ప్రచారం జరిగింది. బద్వేల్ లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లోనూ మొదటిసారిగా సుధ ఫోటోలు దర్శనం ఇవ్వడంతో ఆమె YCP అభ్యర్థిగా బరిలో ఉంటారని అంతా అనుకున్నా జగన్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం చర్చగా మారింది.

కడప జిల్లా బద్వేల్ సిట్టింగ్ MLA డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతిచెందడంతో బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైంది. గత మార్చి 28న ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతిచెందడంతో ఖాళీ అయిన బద్వేల్ SC రిజర్వుడు అసెంబ్లీ స్థానానికి ఎప్పుడైనా.. నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేను కోల్పోయిన YCP తిరిగి ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు అందరికన్నా ముందే ఉప ఎన్నికపై దృష్టి పెట్టింది. మృతి చెందిన వెంకటసుబ్బయ్య కుటుంబం నుంచి అభ్యర్థిని ఎంపిక చేయాలన్న ఆలోచనకు ప్రాధాన్యతనిచ్చింది.

ఇందులో భాగంగానే బద్వేల్ లో పర్యటించిన CM జగన్ పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు. 400 కోట్ల రూపాయలకు పైగానే అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. కడప జిల్లాలో బాగా వెనుకబడ్డ బద్వేల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే అని ప్రకటించిన CM జగన్ వరాల జల్లు కురిపించారు. బద్వేలు పట్టణ అభివృద్ధితో పాటు రెవిన్యూ డివిజన్‌గా బద్వేల్ ను చేస్తున్నట్లు ప్రకటన చేశారు. పలు హామీలను ఇవ్వడంతో పాటు అడిగిన ప్రతి పనిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

అదే వేదికపై డాక్టర్ సుధను వైసిపి అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ఉత్కంఠ కొనసాగినా ఆఖరి నిమిషంలో ఎలాంటి ప్రకటన చేయకుండానే సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. CM పర్యటనలో భాగంగా బద్వేల్ లో ఏర్పాటుచేసిన ప్రతి ఫ్లెక్సీలోనూ మృతి చెందిన MLA వెంకటసుబ్బయ్య, ఆయన భార్య సుధా ఫోటోలకు ప్రాధాన్యత ఇచ్చారు. సుధా పేరును ప్రకటిస్తారని బహిరంగ సభకు హాజరైన నియోజకవర్గ ప్రజలు కూడా ఊహించారు. సుబ్బయ్య సేవలను సభలో కొనియాడిన ఇన్ ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్ కూడా డాక్టర్ సుధ ను YCP అభ్యర్థిగా ప్రకటిస్తారనే ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. అయితే అలాంటి ప్రకటనలు ఏమీ లేకుండా ప్రసంగం ముగించారు సీఎం జగన్.

ఇవి కూడా చదవండి: Revanth Reddy: అంతా అక్కడి నుంచి వచ్చినవారే.. మంత్రి హరీష్ రావుకు పీసీసీ చీఫ్ రేవంత్ కౌంటర్

Cabinet Meeting: ఈనెల 13న తెలంగాణ కేబినెట్ భేటీ.. కరోనా పరిస్థితి, వ్యవసాయంతోపాటు పలు అంశాలపై చర్చ