Chandra Babu Naidu: మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నానంటూ చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈరోజు. కరోనా విరుచుకు పడుతున్న వేళలో తన పుట్టినరోజు వేడుకలకు ఎవరినీ రావద్దనీ..తాను వేడుకలు చేసుకోవడం లేదనీ చంద్రబాబు ప్రకటించారు.
Chandra Babu Naidu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈరోజు. కరోనా విరుచుకు పడుతున్న వేళలో తన పుట్టినరోజు వేడుకలకు ఎవరినీ రావద్దనీ..తాను వేడుకలు చేసుకోవడం లేదనీ చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా జగన్ ”చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను.” అంటూ అయన శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్:
చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను.@ncbn
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2021
ఇదిలా ఉండగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిన్న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ”తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
చంద్రబాబు నాయుడు ట్వీట్:
Wishing @TelanganaCMO KCR Garu a speedy recovery from COVID-19. My prayers are with him. Get well soon!
— N Chandrababu Naidu (@ncbn) April 19, 2021
Also Read: అయోధ్యపై కరోనా ఎఫెక్ట్.. రామాలయాన్ని మూసివేసిన అధికారులు.. శ్రీరామనవమి వేడుకలకు దూరం..
వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్న యంగ్ హీరో.. కొత్త సినిమాను లైన్ లో పెట్టిన ఆది సాయికుమార్..