ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోల్‌కతా చేరుకున్నారు. కాసేపట్లో ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. ఆ సమావేశం అనంతరం ఢిల్లీ బయల్దేరనున్నారు బాబు. వీవీప్యాట్స్ లెక్కించాలంటూ ఆయన మంగళవారం ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. కాగా బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో భాగంగా గత వారం రోజులుగా బిజీగా గడుపుతున్నారు చంద్రబాబు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ మళ్లీ ఎన్డీయే ప్రభుత్వానికే మద్దతు పలికినప్పటికీ.. విపక్షాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేస్తూ.. భేటీలు జరుపుతున్నారు.