Mahabubnagar MLC Bypoll: నేడే ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. బరిలో ముగ్గురు అభ్యర్థులు..

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం కానుంది. బ్యాలెట్ పద్ధతిన జరగనున్న ఎన్నికలో ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గోవా శిబిరాలకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులంతా నేరుగా పోలింగ్‌బూత్‌లకు తరలివస్తున్నారు.

Mahabubnagar MLC Bypoll: నేడే ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. బరిలో ముగ్గురు అభ్యర్థులు..
Revanth Reddy - KCR
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 29, 2024 | 6:11 AM

పార్లమెంట్ ఎన్నికల వేళ పాలమూరులో రసవత్తర పోరు తుది అంకానికి చేరుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోట శాసనమండలి ఉపఎన్నికకు నేడు పోలింగ్ జరగబోతోంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణతో పాటు నిర్వహణకు సంబంధించిన సామగ్రిని అందజేశారు. ఏ కేంద్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ వివరాలను పోలింగ్ అధికారులకు అందజేశారు. బ్యాలెట్ పద్ధతిన నిర్వహించే ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు తమ ఓటు వేయనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం గం.8.00లకు ప్రారంభమై.. సాయంత్రం గం.4.00లకు ముగియనుంది.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలోని కౌన్సిలర్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ,ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నికలో బరిలో మొత్తం ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, స్వతంత్ర్య అభ్యర్ధి సుదర్శన్‌ గౌడ్‌ పోటీలో ఉన్నారు.

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం 1439 మంది ఓటర్లున్నారు. ఇందులో జడ్పీటిసిలు 83, ఎంపీటీసీలు 888, మున్సిపల్ కౌన్సిలర్ లు 449, ఎక్స్ ఆఫీషియో సభ్యులు 19 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ కు 840 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం ఉంది. కాంగ్రెస్ కు సుమారుగా 450పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇక బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్రులు మరో 100కు పైగా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని దేవరకద్ర, జడ్చర్ల, మక్తల్, అలంపూర్ నియోజకవర్గ కేంద్రాలు మినహా మిగతా 10 నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ సెంటర్ లు ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఎంపిడివో ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం లో అత్యధికంగా 245 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజారిటీ సంఖ్య బలం బీఆర్ఎస్ కే ఉన్నా… కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపడంతో పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేయడంతో పెద్ద ఎత్తున వలసలకు అవకాశం ఏర్పడింది. దీంతో బీఆర్ఎస్ తమ ప్రజాప్రతినిధులను కాపాడుకోవడానికి గోవా క్యాంప్‌ శిబిరాలు నిర్వహించింది. వాస్తవంగా బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఓటర్లు మొత్తంగా అదే పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే విజయానికి మాత్రం తిరుగులేదు. దీంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల క్రాస్ ఓటింగ్ పైనే అందరి దృష్టి నెలకొంది. అలాగే బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు ఎవరికి పడతాయో అనే విషయంలో కూడా ఉత్కంఠ నెలకొంది.

వారం రోజుల గోవా క్యాంప్ నుంచి వచ్చిన బీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ఓటర్లంతా కర్నూలు, రాయచూరు, హైదరాబాద్‌లోని రహస్య ప్రదేశాల నుంచి నేరుగా బూత్‌లకే వస్తారు. జరిగే పోలింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఏప్రిల్ రెండో తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు
టీడీపీకి షాక్ ఇచ్చిన మహిళా నేత.. రాజీనామాతో కంగుతిన్న క్యాడర్..
టీడీపీకి షాక్ ఇచ్చిన మహిళా నేత.. రాజీనామాతో కంగుతిన్న క్యాడర్..
హీరోయిన్ సింధు మీనన్ కూతురిని చూశారా ?..
హీరోయిన్ సింధు మీనన్ కూతురిని చూశారా ?..
లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో కాక రేపుతున్న రిజర్వేషన్ అంశం..
లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో కాక రేపుతున్న రిజర్వేషన్ అంశం..
ఈ ఆకులను తరుచూ వాడితే పసిడివండి యవ్వనం మీ సొంతం..
ఈ ఆకులను తరుచూ వాడితే పసిడివండి యవ్వనం మీ సొంతం..
భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు.. ఓటీటీలోకి వచ్చేసిన 'డియర్'
భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు.. ఓటీటీలోకి వచ్చేసిన 'డియర్'
కొబ్బరి నీళ్లతో వేసవి తాపాన్ని తీర్చే హెల్తీ కూల్‌డ్రింక్స్‌ ఇవి!
కొబ్బరి నీళ్లతో వేసవి తాపాన్ని తీర్చే హెల్తీ కూల్‌డ్రింక్స్‌ ఇవి!
ఈ పరిస్థితుల్లో పౌరునికి ఉన్న ఓటు హక్కు రద్దు అవుతుంది.. ఎందుకంటే
ఈ పరిస్థితుల్లో పౌరునికి ఉన్న ఓటు హక్కు రద్దు అవుతుంది.. ఎందుకంటే