వైసీపీలోకి శివాజీరాజా

ఎన్నికలు దగ్గరపడుతుండగా వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన వారు మాత్రమే కాదు సినీ ప్రముఖులు కూడా వైసీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో వైసీపీలోకి చేరేందుకు నటుడు శివాజీరాజా సిద్ధమయ్యారు. ఈ సాయంత్రం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న శివాజీ రాజా ఆయన సమక్షంలో పార్టీ కండువాను కప్పుకోనున్నారు. అయితే ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో శివాజీరాజా ఓటమి పాలయ్యారు. తన ఓటమికి మెగాబ్రదర్ నాగబాబు కారణమని, ఆయనకు రిటర్ట్ గిఫ్ట్ ఇస్తానని […]

వైసీపీలోకి శివాజీరాజా

Edited By:

Updated on: Mar 21, 2019 | 12:07 PM

ఎన్నికలు దగ్గరపడుతుండగా వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన వారు మాత్రమే కాదు సినీ ప్రముఖులు కూడా వైసీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో వైసీపీలోకి చేరేందుకు నటుడు శివాజీరాజా సిద్ధమయ్యారు. ఈ సాయంత్రం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న శివాజీ రాజా ఆయన సమక్షంలో పార్టీ కండువాను కప్పుకోనున్నారు. అయితే ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో శివాజీరాజా ఓటమి పాలయ్యారు. తన ఓటమికి మెగాబ్రదర్ నాగబాబు కారణమని, ఆయనకు రిటర్ట్ గిఫ్ట్ ఇస్తానని శివాజీ రాజా ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.