స్వతంత్య్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రకాశ్‌రాజ్

| Edited By:

Mar 22, 2019 | 3:45 PM

బెంగళూరు : బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానానికి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశ్ రాజ్ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో లోక్‌సభకు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని గతంలోనే ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. అయితే మార్చి 12వ తేదీన బెంగళూరులో మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ రాజకీయ ప్రసంగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రసంగాన్ని ఒకరు రికార్డు చేసి […]

స్వతంత్య్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రకాశ్‌రాజ్
Follow us on

బెంగళూరు : బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానానికి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశ్ రాజ్ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో లోక్‌సభకు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని గతంలోనే ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. అయితే మార్చి 12వ తేదీన బెంగళూరులో మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ రాజకీయ ప్రసంగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రసంగాన్ని ఒకరు రికార్డు చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌పై కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.