వివేకానంద రెడ్డి మృతిపై పది అనుమానాలు
పులివెందుల: కడప జిల్లా పులివెందులలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం ఉదయం సొంత నివాసంలో కన్నుమూశారు. గుండెపోటు వల్లనే ఆయన చనిపోయారని తొలుత వార్తలొచ్చాయి. నుదిటి మీద, ముక్కుపై తీవ్రంగా గాయాలుండటం, రక్తపు మడుగులో ఆయన ఉండటం వంటి విషయాలు పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడిది రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై తలెత్తుతున్న పది అనుమానాలు చూద్దాం.. 1) శరీరంపై […]

పులివెందుల: కడప జిల్లా పులివెందులలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం ఉదయం సొంత నివాసంలో కన్నుమూశారు. గుండెపోటు వల్లనే ఆయన చనిపోయారని తొలుత వార్తలొచ్చాయి. నుదిటి మీద, ముక్కుపై తీవ్రంగా గాయాలుండటం, రక్తపు మడుగులో ఆయన ఉండటం వంటి విషయాలు పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడిది రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై తలెత్తుతున్న పది అనుమానాలు చూద్దాం..
1) శరీరంపై ఐదు చోట్ల గాయాలు ఎలా అయ్యాయి? ఎందుకయ్యాయి? 2) తల వెనుక భాగంలో రెండు బలమైన గాయాలు 3) నుదుటి భాగం, ముక్కు, అరచేతికి గాయాలు 4) హత్యే అని సన్నిహితులు వాదిస్తున్నారు. 5) బత్రూంలో చనిపోయి ఉంటే మరి బెడ్‌రూంలోకి బ్లడ్ ఎలా వచ్చింది? 6) బెడ్‌రూంలో రెండు లీటర్లకు పైగా బ్లడ్ ఉంది. 7) ఇంటి వెనక భాగంలో డోర్ తెరిచి ఉంది. 8) అర్ధరాత్రి దుండగులు వెనక నుంచి వచ్చి దాడి చేశారా? 9) బెడ్‌రూంలో దాడి చేసి బాత్రూంలో పడేశారా? 10) హత్య కేసును సహజ మరణంగా మార్చే ప్రయత్నం చేశారా?



