
అందాల ముద్దుగుమ్మ అనన్య శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ చాయ్ బిస్కెట్, బాయిస్ ఫార్ముల ఛానెల్స్‌లోని షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌లో ఈమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సిరీస్‌తోనే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ.

ఈ అమ్మడు వరంగల్ జిల్లా కు చెందినది. కానీ చెన్నైలో వీఐటీలో ఇంజనీరింగ్ చదువుతుంది. చిన్నప్పటి నుంచే ఈ బ్యూటీకి నటన అంటే చాలా ఇష్టం. దీంతో యూట్యూబ్ ఛానెల్‌లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో మెరుస్తుంది.

ఈ బ్యూటీ తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌లో చాలా ఆఫర్స్ రావడంతో చాలా వాటిల్లో నటించి, యూట్యూబ్ స్టార్‌గా పాపులారిటీ సంపాదించుకుంది. తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి, పలు సినిమాల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది.

ఈ బ్యూటీ ఏకంగా రామ్ చరణ్, గేమ్ చేంజర్, లక్కీ భాస్కర్ వంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. అంతే కాకుండా ప్రస్తుతం ఈ చిన్నది వెబ్ సిరీస్‌లే కాకుండా పలు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసి, వరస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నట్లు టాక్.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా సింపుల్ లుక్‌లో ఉదయకిరణాలలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.