బ్లూ కోరల్ స్నేక్: బ్లూ కోరల్ స్నేక్ అనేది సన్నని, మరి లావుగా కాకుండా ఆకర్షణీయమైన రంగులతో కూడిన పాము ఇది. దీని శరీరం నలుపు లేదా ముదురు నీలం రంగులో ఉంటుంది. దాని వైపులా తెలుపు లేదా లేత నీలం చారలు ఉంటాయి. అవి ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటాయి. దాని తల కూడా ఎర్రగా ఉంటుంది. తోక కూడా ఎర్రగా ఉంటుంది. ఈ పాము ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. ఇది చాలా విషపూరితమైనది.
శాన్ ఫ్రాన్సిస్కో గార్టర్ పాము: శాన్ ఫ్రాన్సిస్కో గార్టర్ పాము అత్యంత అందమైన జాతులలో ఒకటి. ఈ పాము ప్రకాశవంతమైన నీలం లేదా ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉంటుంది. దాని శరీరంపై ఎరుపు, నలుపు చారలు ఉంటాయి. దీని విషం చాలా విషపూరితమైనది. కానీ దీనిని అనేక రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ జాతి అంతరించిపోతోంది.
అరిజోనా కోరల్ స్నేక్: ఈ పాము చిన్నగా, సన్నగా కనిపిస్తుంది. కానీ నిజానికి దీనిని యమదూత అని పిలుస్తారు. ఇది చాలా విషపూరితమైన పాము. దాని ప్రకాశవంతమైన ఎరుపు, నలుపు, పసుపు చారలతో ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఈ పాము అరిజోనా, మెక్సికోలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.
కింగ్ కోబ్రా: ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము కింగ్ కోబ్రా. దీని పొడవు 18 అడుగుల వరకు ఉంటుంది. ఇది ఎవరిపైనైనా దాడి చేసే ముందు దాని శరీరం మూడో వంతు ఎత్తులో పైకి లేస్తుంది. ఇది దీని విషన్ని ఎక్కువ దూరం చిమ్ముతుంది. చాలా ప్రమాదకరమైనది.
రెయిన్బో బోవా: రెయిన్బో బోవా దాని అందమైన ప్రకాశవంతమైన మెరుపుకు ప్రసిద్ధి చెందింది. ఈ పాము అమెజాన్ బేసిన్‌లో కనిపిస్తుంది. ఇది మరి లావుగా, మరి సన్నగా కాకుండా ఉంటుంది. దీని బేస్ ఎరుపు-గోధుమ రంగులో ఉంటుంది. నలుపు, నారింజ మచ్చలు ఉంటాయి. ఇంద్రధనస్సు మెరుపు చాలా అందంగా కనిపిస్తుంది.