Toll tax: బైక్, ఆటోలకు టోల్ ఛార్జీలు ఎందుకు ఉండవో తెలుసా!.. అసలు కారణాలు ఇవే!
మీరు హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్‌గేట్‌లు వస్తుంటాయి. కార్లు, బస్సులు, ట్రక్కులు అన్నీ టోల్ చెల్లించడానికి అక్కడ క్యూ కడతాయి. కానీ బైక్స్, ఆటోస్ మాత్రం టోల్ చెల్లించకుండా టోల్ గేట్ దాటి వెళ్లిపోతుంటాయి. ఇలా కార్లు, ట్రక్కులకు ఉన్న టోల్ ఫీజ్.. బైక్‌లు ఆటోలకు ఎందుకుండదని మీరెప్పుడైనా ఆలోచించారా? మీకు ఈ డౌట్ వస్తే.. కచ్చితంగా ఈ విషమం తెలుసుకోవాల్సిందే.
Updated on: Nov 06, 2025 | 7:23 PM

భారతదేశంలో ట్రక్కులు, లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలతో పొల్చుతే ద్విచక్ర వాహనాలకు టోల్ పన్ను నుండి పూర్తిగా మినహాయింపు ఉంది. భారత జాతీయ రహదారుల టోల్ నియమాలు, 2008 లోని నియమం 4(4) ప్రకారం, ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలకు టోల్ పన్ను నుండి పూర్తిగా మినహాయింపు ఉంది.

వీటికి పన్ను మినహాయింపు ఎందుకంటే ద్విచక్ర వాహనాలు చాలా తేలికగా ఉంటాయి. అలాగే తక్కువ స్థలాన్ని తీసుకుంటాయి, అంతేకాకుండా ఇవి ట్రక్కులు, బస్సులు, కార్లు, లారీలు వంటి భారీ వాహనాల వలె రోడ్డుకు ఎక్కువ నష్టం కలిగించవు. అందుకే ప్రభుత్వం వాటి నుండి టోల్ వసూలు చేయదు.

అంతేకాకుడా మన దేశంలో చాలా మంది మధ్యతరగతి వారు ద్విచక్ర వాహనాలను ఎక్కువగా వినియోగిస్తారు. ఈ వాహనాలపై టోల్ పన్ను విధించడం వల్ల లక్షలాది మంది రోజువారీ ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. మరోకారణం ఏంటంటే దేశంలో ద్విచక్రవాహనాలు ఎక్కువగా ఉంటాయి. వీటిన టోల్‌కోసం హైవైపై ఆపడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అలాగే టోల్ తీసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది.

అలాగే, సోషల్ మీడియాలో ఒక ట్రాఫిక్ పోలీసు అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం, రిక్షాలకు హైవేపై కాకుండా నగరంలోనే లైసెన్స్ ఉంటుంది, కాబట్టి అవి టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, రిక్షాలు హైవేపై తిరుగుతాయి.

బైక్స్ లేదా ఆటోస్ కొన్నప్పుడు.. రిజిస్ట్రేషన్ సమయంలో రోడ్డు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది..ఈ పన్ను పరోక్షంగా ప్రజా రహదారులు, రహదారులను ఉపయోగించేందుకు అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది. దీని వల్ల వాళ్లు మరోసారి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసారిన్ని తగ్గిస్తుంది.




