AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లు బాదం పప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది..!

పోషకాల నిధి బాదం పప్పు అని పిలుస్తారు. డ్రైఫ్రూట్‌ కోవకు చెందిన ఈ పప్పులో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా నిండి ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికం. బాదం పప్పులో ఉండే ఎల్ కార్నిటైన్, న్యూట్రియంట్లు మెదుడును చురుగ్గా ఉంచుతాయి. బాదం పప్పులో మోనోశాచురేటెట్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మం, జుట్టు సంరక్షణలో బాదం పప్పులు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. కానీ, కొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి దూరంగా ఉండాలి. వారెవరో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Aug 17, 2025 | 1:28 PM

Share
హై బీపీ సమస్య ఉన్నవారికి బాదం పడదు. బాదం పప్పులో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నిషియం బీపీ లెవల్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతూ..మందులు వాడుతున్న వారు బాదం పప్పు జోలికి పోకూడదంటున్నారు నిపుణులు.

1 / 5
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు బాదం పప్పు ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే బాదం పప్పులో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఆక్సలేట్ స్థాయిలు పెరిగితే కిడ్నీలో లేదంటే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
Almonds

Almonds

3 / 5
బాదం పప్పులో కేలరీలు, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా బర్న్ కావు. దీంతో.. వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు మరింత పెరిగే ప్రమాదముంది. అందుకే  అధిక బరువు లేదా ఊబకాయ సమస్యతో బాధపడేవారు బాదం పప్పులు తినకూడదని అంటున్నారు.

4 / 5
మైగ్రేన్ సమస్య ఉన్నవారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వారు బాదం పప్పుల్ని తినకూడదంటున్నారు నిపుణులు. అలాగే, చర్మంపై దురద, ఎర్రటి మచ్చలు, శ్వాస కోస సమస్యలతో బాధపడేవారు బాదం పప్పు ఎక్కువగా తినకూడదు. బాదం పప్పు తినడం వల్ల ఈ సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు అంటున్నారు.

5 / 5
Follow Us