Vitamin B12: విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహార పదార్థాలు..
విటమిన్ బి 12 మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి మాత్రమే మనకు లభిస్తుంది ఎందుకంటే విటమిన్ బి 12 శరీరం సొంతంగా తయారు చేయలేని ముఖ్యమైన పోషకం...
B12
Follow us
గుడ్లలో ప్రోటీన్‌తో పాటు, అనేక ప్రయోజనకరమైన విటమిన్లు ఉంటాయి. వాటిలో ఒకటి విటమిన్ బి -12. కోడిగుడ్డు తెల్లసొనలో కన్నా పచ్చసొనలో అధిక మొత్తంలో విటమిన్ బీ 12 ఉంటుంది.
శాకాహారులకు విటమిన్ బి 12 ఉత్తమ వనరులు పాలు, వాటి నుంచి వచ్చే పాల ఉత్పత్తులు. ఒక కప్పు పాలలో 1.2 ఎంసిజి విటమిన్ బి12 ఉంటుంది. అదనంగా, 226 గ్రా తక్కువ కొవ్వు పెరుగులో 1.1 ఎంసిజి విటమిన్ బి-12 ఉంటుంది.
హెర్రింగ్, సాల్మన్, సార్డినెస్, ట్యూనా ట్రౌట్ వంటి చేపలలో విటమిన్ బి 12 అధికంగా ఉంటుంది. ఈ చేపలన్నీ మన శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి. మంచినీటి చేపలలో ప్రోటీన్, కొవ్వు, బి విటమిన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, మాంగనీస్ సెలీనియం కూడా పుష్కలంగా ఉన్నాయి.
మాంసంలో కూడా విటమిన్ బి -12 యొక్క మంచి మూలంగా పరిగణించబడుతుంది. 85 గ్రా కాల్చిన చికెన్‌లో 12 0.3 ఎంసిజి విటమిన్ లభిస్తుంది.
జున్నులో ఇతర పోషకాలతో పాటు విటమిన్ బి 12 కూడా పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల జున్నులో 0.34 నుండి 3.34 మైక్రోగ్రాముల విటమిన్ బీ 12 ఉంటుంది. మార్కెట్లో లభించే జున్ను కన్నా ఇంట్లో తయారు చేసుకునే జున్నులో అధిక మొత్తంలో విటమిన్ బీ12 లభిస్తుంది.