- Telugu News Photo Gallery What Your Illness Dreams Mean? The Science Behind Illness Dreams Explained
అనారోగ్యంగా ఉన్నట్టు కలలు వస్తున్నాయా?.. వాటికి సంకేతం కావచ్చు.. కచ్చితంగా తెలుసుకోండి!
పడుకున్నప్పుడు కలలు రావడం అనేది సర్వసాధారణం. కానీ మనకు వచ్చే కలలను బట్టి కలల శాస్త్రంలో ఒక్కోదానికి ఒక్కోలా అర్థాలు ఉన్నాయి. మనకు వచ్చే కలల్లో కొన్ని శుభాన్ని చూసిస్తాయి మరికొన్ని ఆశుభాన్ని సూచిస్తాయి. అదే ఒక వేళ మనకు అనారోగ్యంగా ఉన్నట్టు కలలు వస్తే అవి దేనికి సంకేతం. అలా రావడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Sep 19, 2025 | 7:38 PM

మనం గాడ నిద్రలో ఉన్నప్పుడు మనకు కలలు వస్తుంటాయి. మనకు ఒక్కోసారి ఒక్కో కలలు వస్తుంటాయి. కొన్ని సార్లు మనకు ఏదైనా జరిగినట్టు, మనం బావిలో పడుపోతున్నట్టు ఇలా అనేక రకాల కలలు వస్తాయి. అయితే ఇలా మీరు అనారోగ్యంగా ఉన్నట్టు కలలు వస్తే.. అది మీకు కొన్ని సంకేతాలను ఇస్తుందని అర్థం.

మీరు అనారోగ్యంతో ఉన్నట్టు కలలు కనడం ఎల్లప్పుడూ చెడ్డ సంకేతమే కాదు.. కొన్ని సార్లు ఇది శుభ సంకేతాలను కూడా సూచిస్తుంది. కాబట్టి, ఇలాంటి కలలు దేని సంకేతాలో.. కలల శాస్త్రం వీటి గురించి ఏం చెబుతోందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

పడుకున్నప్పుడు మీరు తరచూ అనారోగ్యంతో ఉన్నట్లు కలలు కంటుంటే, మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం. అంతేకాకుండా మీరు ఎప్పుడూ మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ.. మానసికంగా కుంగిపోతున్నారని అర్థం.

కలల శాస్త్రం ప్రకారం, మీరు అనారోగ్యంతో ఉన్నట్లు కలలు కన్నట్లయితే, ఇది మంచి సంకేతం. నిజ జీవితంలో మీ అనారోగ్య సమస్యలు క్రమంగా తగ్గుతున్నాయని దీని అర్థం.

అలాగే, మీరు అనారోగ్యంతో ఉన్నట్లు కలలు కన్నట్లయితే, మీరు ఎక్కడో ఒక చోట గౌరవం పొందవచ్చని సూచిస్తుంది. (NOTE: పై వ్యాసంలోని సమాచారం నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అందించబడినవి. మేము ఈ సమాచారాన్ని నిర్ధారించడం లేదు. మూఢనమ్మకాలను వ్యాప్తి చేయాలనేది కూడా మా ఉద్దేశ్యం కాదు. పై వ్యాసంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, మీరు దయచేసి సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.




