బెల్లం, లవంగాలు కలిపి తిన్నారంటే తిరుగులేని శక్తి..! ఆ సమస్యలకు చెక్..
చలికాలం మొదలైంది. చల్లటి గాలులలు, తగ్గిన ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు వివిధ వ్యాధుల బారినపడుతుంటారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవటం, శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం పలు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అందుకే చలికాలంలో తీసుకోవాల్సిన కొన్ని ఆహారాలు అతి ముఖ్యమైనవి. అందులో లవంగం, బెల్లం కూడా ఉన్నాయి. లవంగాలు, బెల్లం కలిపి తినటం వల్ల శరీరం వేడిగా ఉంటుందని, మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Nov 10, 2025 | 1:16 PM

బెల్లం, లవంగాలను కలిపి తీసుకుంటే గొంతు సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా గొంతు నొప్పి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు సంబంధిత సమస్యలకు సైతం ఇది దివ్యౌషధంగా చెప్పొచ్చు. లవంగం, బెల్లం కలిపి తీసుకుంటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలన్నీ దూరమవుతాయి.

బెల్లం, లవంగాలను కలిపి తినడం వల్ల శరీరానికి విటమిన్ బి, ఎ, సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు లభిస్తాయి.

బెల్లం, లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. బెల్లం, లవంగాలు రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థను బలోపేతం అవుతుంది. వీటిని కలిపి తింటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు నయమవుతాయి.

బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే లవంగం, బెల్లంను కలిపి తీసుకోవాలి. ఇందులోని గుణాలు కడుపు నిండిన భావన కలిగేలా చేస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతంది. ముఖ్యంగా ఆస్తమా, లంగ్స్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

బెల్లం, లవంగాలు తీసుకోవడం వల్ల శ్వాసకోశ నాళాలు శుభ్రపడతాయి. ఉబ్బసం, బ్రోన్కైటిస్ వంటి సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగించి, చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు సహాయపడతాయి.




