- Telugu News Photo Gallery What happens if you eat yogurt at night? What experts say's, Check Here is Details
Curd at Night: రాత్రి పెరుగు తింటే ఏం జరుగుతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. భోజనం చివరిలో పెరుగు తినకపోతే.. తిన్నట్టు అనిపించదు. పెరుగు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి అవసరం అయ్యే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పెరుగు తింటే శరీర ఆరోగ్యం, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి రోజూ ఓ కప్పు పెరుగు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్.. శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలను బయటకు..
Updated on: Oct 26, 2024 | 6:19 PM

పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. భోజనం చివరిలో పెరుగు తినకపోతే.. తిన్నట్టు అనిపించదు. పెరుగు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి అవసరం అయ్యే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పెరుగు తింటే శరీర ఆరోగ్యం, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.

ప్రతి రోజూ ఓ కప్పు పెరుగు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్.. శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలను బయటకు పంపుతాయి. శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది.

పెరుగు తింటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటీస్, బీపీ కూడా అదుపులో ఉంటాయి. అయితే రాత్రి పూట పెరుగు తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? అని చాలా మంది సందేహిస్తూ ఉంటారు. ఆ సందేహానికి జవాబు ఇప్పుడు తెలుసుకుందాం.

కఫం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధ పడేవారు రాత్రి పూట పెరుగు తినకపోవడమే మంచిది. దీని వల్ల సమస్య మరింత పెరగొచ్చు. ఈ సమస్యలు లేని వారు మాత్రం ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అదే విధంగా శ్వాస కోస సమస్యలు, వాతవ చేసే గుణం ఉన్నవారు కూడా రాత్రి పూట పెరుగు తినకపోవడం మంచిది. ఈ సమస్యలతో పెరుగు తినడం వల్ల నిద్రించే సమయంలో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)




