
బాదంపప్పును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ మూడు నుంచి నాలుగు బాదంపప్పులు నానబెట్టుకుని తినడం వలన అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

అయితే ఇప్పుడు బాదం పప్పుని రోజూ తగిన మోతాదులో తినడం వలన బరువుని తగ్గవచ్చు అని.. బరువు అదుపులో ఉండవచ్చు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ప్రపంచంలో ఎక్కువమంది ప్రస్తుతం అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపధ్యంలో సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన అధ్యయన బృందం బరువు అదుపు చేయడం కోసం చేసిన పరిశోధనలో బాదం బెస్ట్ ని గుర్తించింది.

వాస్తవానికి బాదంపప్పు అధిక పోషకాలను కలిగి ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలతో సహా కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

Almonds

బాదంపప్పులో ప్రొటీన్లు, పీచు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఎవరైనా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే బాదంపప్పులను తినవచ్చు.

అయితే, బాదంపప్పులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని తినే ఆహారంలో చేర్చుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పని సరి. వీటిని అతిగా తీసుకోకపోవడం మంచిది.

రాత్రి భోజనం తర్వాత నాలుగైదు బాదం పప్పులను తినడం మంచిది. సాయంత్రం స్నాక్‌గా తిన్నా లేదా ఉదయాన్నే నిద్రలేచి తర్వాత బాదంపప్పును పెట్టుకుని తినవచ్చు.

బాదం పప్పులను తినలెం అనుకునేవారు బాదం స్మూతీ తయారు చేసుకుని తాగవచ్చు. ఈ స్ముతీ లో ఇతర పండ్లను జోడించాలి. లేదా బాదంపప్పును కొన్ని ఇతర డ్రై ఫ్రూట్స్ తో కలిపి తిన్నా గుండెకు మంచిదని చెబుతున్నారు.