
అరటి చెట్టులో నారాయణుడు ఉంటాడని విశ్వాసం. అరటి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవి కొలువై వుంటారని విశ్వాసం. ఇంట్లో అరటి మొక్కను నాటడం ద్వారా గురు గ్రహం యొక్క శుభ ఫలితాలు పొందుతారు.శుభప్రదమైన ఈ చెట్టుని మీ ఇంటి బయట నాటుకోవచ్చు. ఇంటి ముందు కాకుండా అరటి చెట్టును ఇంటి వెనుక నాటాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈ చెట్టును ఎక్కడ నాటినా సంతోషానికి, శ్రేయస్సుకు లోటుండదు. ఇంట్లో దీని ఉనికి వైవాహిక జీవితంలోని కష్టాలను తొలగిస్తుంది. పెళ్లికాని అమ్మాయిలకు త్వరలో పెళ్లి అవుతుందని విశ్వాసం. ఈ చెట్లు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో పిల్లలు ఎప్పుడూ సంతోషంగా, కష్టాలకు దూరంగా ఉంటారని విశ్వాసం.

అరటి చెట్లు ఉన్న ఇంట్లోని వారికి ఉన్నత విద్య- జ్ఞానాన్ని పొందడంలో ఇది సహాయపడుతుంది. ఎందుకంటే, అరటి చెట్లు శాంతియుత సానుకూల శక్తిని ప్రసరిస్తుందని చెబుతున్నారు. అరటి చెట్టుకు నీళ్ళు పోసి పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. అరటి చెట్టును పూజించడంతో శ్రీ మహావిష్ణువు కూడా ప్రసన్నుడవుతాడు. విష్ణువు, లక్ష్మీదేవికి అరటి పండును నిత్యం నైవేద్యంగా సమర్పించడంతో భక్తుల వారి దీవేనలు అందుకుంటారు.

అరటి చెట్టు ధనం, ఆహారం, శాంతి, సంపత్తికి సూచిస్తుంది. అరటి చెట్టు గురు గ్రహానికి కారకం. ఎవరి జాతకంలో గురువు అశుభ స్థితిలో ఉంటాడో, వారు అరటి చెట్టును పూజించాలని పండితులు చెబుతున్నారు. అయితే, దక్షిణ, పడమర దిశల్లో అరటి మొక్కను నాటకూడదని చెబుతారు. అరటి చెట్టును ఎప్పుడూ తూర్పు , ఉత్తర దిశలలోనే నాటాలి.

ఎవరికైనా వివాహంలో ఆలస్యం అవుతుంటే, వారు అరటి చెట్టును పూజించాలని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అరటి చెట్టును పూజించడం వల్ల త్వరగా పెళ్లి యోగం కలుగుతుందని వివరించారు. అలాగే, భార్యభర్తల మధ్య ప్రేమ జీవితం సంతోషంగా సాగుతుందని చెబుతున్నారు. మంచి సంతానం కోసం కూడా అరటి చెట్టును పూజించాలని సూచిస్తున్నారు. అన్ని కాలాల్లో దొరికే అమృత ఫలం ఇది. ఇంటి ఆవరణలో దీనిని పెంచకుండా.. పెరటిలోనే పెంచాలని చెబుతున్నారు.