పచ్చి బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..
ఏ సీజన్‌లో అయినా పండ్లు తినడం ఆరోగ్యకరం. ఇది మనందరికీ తెలిసిందే. అయితే సహజ సిద్ధంగా లభించే పండ్లలో అనేక పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అటువంటి పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ఇందులో విటమిన్లు, మినరల్స్ సహా మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, సాధారణంగా బొప్పాయిని అందరూ పండిన తర్వాతనే తింటారు. కానీ, బొప్పాయి పచ్చిగా ఉన్నప్పుడు కూడా కూడా తింటారని మీకు తెలుసా..? అవును, పైగా పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. ఇంతకీ, పచ్చి బొప్పాయి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Jun 04, 2025 | 12:49 PM

పచ్చి బొప్పాయి పాపైన్ వంటి ఎంజైమ్‌లను కలిగి ఉంటింది. ఇది శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయి లో విటమిన్లు ఎ, సి మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి రక్షించగలవు. పచ్చి బొప్పాయి తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది.

పచ్చి బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఊబకాయం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయి కాయ తినడం వలన మలబద్ధకంను నివారించవచ్చు. బొప్పాయి ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. పచ్చి బొప్పాయి శరీరంలో మంటను తగ్గిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్, ఋతు తిమ్మిరితో సహా శరీరంలో కలిగే అనేక రకాల నొప్పులు, మంట, వాపులను నివారిస్తుంది.

పచ్చి బొప్పాయిలో పొటాషియం, ఫైబర్ , ఫోలేట్ ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పచ్చి బొప్పాయి కాలేయ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతుంది.కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

పచ్చి బొప్పాయి తినడం వల్ల పురుషులలో ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పెద్దప్రేగులో ఉండే టాక్సిన్స్‌ను తొలగిస్తుంది.

కామెర్ల నివారణకు పచ్చి బొప్పాయి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో పాపైన్ అనే ప్రొటీయోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. దీని నుంచి మందులు కూడా తయారని చెబుతున్నారు. వీటిని కామెర్లు చికిత్సలో ఉపయోగిస్తారని అంటున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి మలేరియా రోగులలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.




