ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం.. భారీగా ఉద్యోగాలు!

Edited By:

Updated on: Jan 18, 2026 | 9:32 PM

విశాఖ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖపట్నంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కానుంది. దీనితో ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు విదేశీ ప్రయాణాలకు హైదరాబాద్, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ కార్యాలయం విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి, అంతర్జాతీయ విమాన సేవలు, కార్గో కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తుంది. పర్యాటకం, వ్యాపారం, ఉపాధి అవకాశాలు పెరిగి, విశాఖ ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదుగుతుంది.

1 / 5
విశాఖపట్నానికి మరో కీలక కేంద్ర ప్రభుత్వ కార్యాలయం రానుంది. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణాల విషయంలో పెద్ద ఊరట లభించనుంది. ఇప్పటివరకు ఇమిగ్రేషన్ ప్రక్రియల కోసం హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాలపై ఆధారపడాల్సి వస్తుండగా, ఇకపై విశాఖ నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

2 / 5
ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం దేశీయ ప్రయాణాలకు మాత్రమే పరిమితమై ఉంది. అంతర్జాతీయ విమానాలు ప్రారంభించాలంటే ఇమిగ్రేషన్ సదుపాయాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో విశాఖలో ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

3 / 5
కేంద్ర హోంశాఖ అధికారికంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో అవసరమైన ప్రక్రియలను వేగంగా పూర్తి చేయనున్నారు. విమానాశ్రయంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకంపై సంబంధిత శాఖలు దృష్టి సారించాయి

4 / 5
ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కావడం వల్ల విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.  విదేశీ విమానాల నిర్వహణతో పాటు కార్గో సేవలు కూడా విస్తరించే అవకాశం ఉంది. దీని వల్ల వ్యాపారం, పరిశ్రమలు, పర్యాటక రంగానికి కొత్త ఊపొస్తుందని అంచనా. ముఖ్యంగా ఐటీ, ఎగుమతులు, విద్యార్థుల విదేశీ ప్రయాణాలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది.

5 / 5
ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల ప్రజలు కూడా విశాఖ విమానాశ్రయాన్ని వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయం రావడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. మొత్తంగా విశాఖను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఇది మరో కీలక అడుగుగా అధికారులు పేర్కొంటున్నారు.